6 న రాష్ట్రంలో తుఫాన్

narayana

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ హింది తొలిసారిగా నటించిన చిత్రం జంజిర్ తెలుగులో తుఫాన్'గా రాబోతుంది. సినిమా ఎలా వుంటుందన్న విషయం గురించి కాకుండా, సినిమా ఎలా రిలీజ్ అవుతుందన్న దానిపైనే ఇండస్ట్రీ ప్రముఖులు కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు చిరంజీవి కుటుంబానికి చెందిన సినిమాలను రిలీజ్ చేయనివ్వం.


అంటూ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో 'ఎవడు', 'అత్తారింటికి దారేది' సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో 'జంజీర్' తెలుగు వెర్షన్ అయిన 'తుఫాన్' చిత్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ సెప్టెంబర్ 6న విడుదల చేసేయడానికి చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు.

ఓపక్క సీమాంధ్రలో ఈ వాతావరణంలో 'తుఫాన్' చిత్రాన్ని ఎలా రిలీజ్ చేస్తారు? ఉద్యమకారులు ఎలా అడ్డుకుంటారు? అన్న విషయాలను ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తోంది. ఒకవేళ ఈ సినిమాకు అంతగా అవాంతరాలు ఏర్పడకపోతే కనుక, ఇప్పటికే రెడీగా వున్న ఇతర పెద్ద సినిమాలను కూడా వరుసగా వదిలేస్తారన్న మాట!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: