పరశురాం వెంటపడుతున్న యువ హీరోలు..!

shami
గీతా గోవిందం హిట్ తో దర్శకుడిగా ప్రతిభ చాటిన పరశురాం తన డైరక్షన్ లో వచ్చిన ఏ సినిమా నిరాశపరచలేదు అన్న విషయం గుర్తుతెచ్చేలా చేశాడు. ఆంజనేయులు నుండి గీతా గోవిందం వరకు సేఫ్ ప్రాజెక్టులే చేశాడు పరశురాం. ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతా గోవిందం విజయ్ ఫ్యాన్స్ ను మెప్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.


ఇక ఈ సినిమా వసూళ్ల హంగామా గురించి అందరికి తెలిసిందే. గీతా గోవిందంతో విజయ్ ఖాతాలో మరో హిట్ పడేలా చేసిన పరశురాం వెంట యువ హీరోలు క్యూ కడుతున్నారు. కేవలం హీరోలే కాదు నిర్మాతలు కూడా అడ్వాన్సులు ఇచ్చి రెడీగా ఉన్నారట. వారిలో ముందుగా మంచు విష్ణు ఉన్నాడని తెలిసిందే.


పరశురాం తన తర్వాత సినిమా విష్ణుతో చేస్తాడని తెలుస్తుంది. ఇక ఆ సినిమా తర్వాత సాయి ధరం తేజ్, నాగ చైతన్యలు తమ కోసం ఓ కథ సిద్ధం చేయమని చెప్పారట. అసలైతే గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పరశురాం తో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశారట. కాని అంతకుముందే ఇచ్చిన కమిట్మెంట్ వల్ల మంచు హీరోకి సినిమా చేయాల్సి వస్తుంది.


పరశురాం లిస్ట్ లో చైతు, తేజూతో పాటుగా నాని కూడా ఉన్నాడట. పరశురాం ఇదవరకు సినిమాలు యావరేజ్ సక్సెస్ అందుకోగా లేటెస్ట్ గా వచ్చిన గీతా గోవిందం మాత్రం కమర్షియల్ గా కూడా సినిమా సూపర్ హిట్ అందుకుంది. చూస్తుంటే ఇదే రేంజ్ సక్సెస్ లను అందుకుంటే కనుక టాలీవుడ్ కు మరో స్టార్ డైరక్టర్ దొరికేసినట్టే అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: