జూనియర్ చరణ్ లతో రాజమౌళి త్వరలో మొదలు పెట్టవలసి ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కథ విషయంలో ఏర్పడుతున్న సమస్యల వల్ల ఆలస్యం అవుతోంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే విజయేంద్ర ప్రసాద్ లాంటి చేయితిరిగిన రచయిత తన ఇంటిలో ఉంచుకుని రాజమౌళికి ఇలాంటి సమస్యలు ఏమిటి అన్న కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వస్తోంది.
వాస్తవానికి చరణ్ జూనియర్ లతో తీయబోయే సినిమా స్టోరీ లైన్ ముందుగానే అనుకుని రాజమౌళి ఈప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. ముందుగా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ను కేవలం తెలుగులో మాత్రమే నిర్మించాలని భావించాడు. అయితే తరువాత వచ్చిన ఆలోచనలతో ఈమూవీని బాలీవుడ్ కోలీవుడ్ లలో కూడ విడుదలచేయాలని భావించి ఈమూవీ బడ్జెట్ ను అత్యంత భారీగా పెంచడంతో ఈమూవీ కథ విషయంలో సమస్యలు ప్రారంభం అయ్యాయి అని టాక్.
తెలుగు తమిళ హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఒకే కథను తయారుచేయడం ఇప్పుడు రాజమౌళికి సమస్యగా మారింది అని అంటున్నారు. దీనికితోడు ఒక జానపద కథను అదేవిధంగా చారిత్రాత్మక కథను అన్ని భాషల వారికి నచ్చే విధంగా తీసినంత సులువుగా ఒక సాంఘీక కథను రూపొందించడం కష్టం అన్న అభిప్రాయం ఆలస్యంగా రాజమౌళికి తెలిసింది అనిఅంటున్నారు.
దీనితో ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా అటు బాలీవుడ్ ప్రేక్షకులు ఇటు కోలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని ఒక డిఫరెంట్ కథను ఎంచుకోవడం రాజమౌళికి పెను సమస్యగా మారింది అని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల విజయేంద్ర ప్రసాద్ ఎన్ని కథలు చెప్పినా ఏకథ పూర్తిగా రాజమౌళికి నచ్చని పరిస్థితి ఏర్పడింది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ఈ రాబోతున్న డిసెంబర్ కు కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయంలో ఏర్పడ్డ సమస్యలు పరిష్కారం కాకపోయిన ఆశ్చర్యం లేదు అంటూ కొందరు ఇండస్ట్రీ వ్యక్తులు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్..