యంగ్ హీరో సుధీర్ బాబు ఇప్పటి వరకు చాల సినిమాలలో నటించినా అతడికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఇప్పటి వరకు ఏర్పడక పోవడంతో చాలామంది సుధీర్ బాబును మహేష్ బావగానే గుర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పిలుపు సుధీర్ బాబుకు నచ్చడంలేదు అని తెలుస్తోంది.
దీనికి మరింత బలం చేకూర్చే విధంగా సుధీర్ బాబు ఈమధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను ఆధారంగా చేసుకుని ఈ యంగ్ హీరో మహేష్ ఇమేజ్ తనకు వద్దు అని భావిస్తున్నాడా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవారం విడుదల కాబోతున్న ‘సమ్మోహనం’ మూవీని ప్రమోట్ చేస్తూ సుధీర్ బాబు తన సినిమాలకు సంబందించి తరుచు మహేష్ సపోర్ట్ అడిగితే సూపర్ స్టార్ కృష్ణ కుటుంబాన్ని మరోసారి కట్నం అడిగినట్టు ఉంటుందని అంటూ కామెంట్స్ చేసాడు.
అంతేకాదు తాను సినిమాలలోకి వచ్చింది తన సంతృప్తికోసం అని చెపుతూ తన తండ్రి బిజినెస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతకాలు పెడుతూ కూర్చుంటే తనకు రోజు గడిచిపోతుందని కేవలం తన ఆత్మ సంతృప్తి కోసమే సినిమా రంగంలోకి వచ్చాను అని అంటున్నాడు సుధీర్ బాబు. అదేవిధంగా తనకు సినిమాలలో అవకాశాలు రావడానికి మహేష్ పేరు వాడుకోవడం తనకు ఇష్టం లేదు అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు సుధీర్ బాబు.
సుధీర్ బాబుకు తను ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని ‘సమ్మోహనం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు అన్నాడు. అంతేకాదు తాను కేవలం సుధీర్ బాబు ఆడియో ఫంక్షన్లకు మాత్రమే వస్తున్నాను అంటూ కామెంట్స్ చేసాడు. అయితే ఇప్పుడు మహేష్ కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ సుధీర్ బాబు కొంచం ఆలస్యంగా స్పందించాడా ? లేదంటే సుధీర్ బాబు ఇలా ఓపెన్ గా తనకు మహేష్ ఇమేజ్ అక్కరలేదు అని చేసిన కామెంట్స్ వెనుక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..