బాలయ్య టార్గెట్ లో ఆ నలుగురు !

Seetha Sailaja
ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజ తప్పుకోవడం వెనుక రాజకీయకారణాలు కూడ ఉన్నాయి అన్నవార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ ఈబయోపిక్ ను ఎన్టీఆర్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన సంఘటనతో ముగిద్దాము అని భావిస్తే తేజ కనీసం అప్పట్లో నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ ను వెన్నుపోటుపొడిచిన సంఘటన అయినా చూపెట్టాలి అని భావించినట్లు టాక్.

అయితే ఈసలహాకు కూడ బాలయ్య స్పందించకపోవడంతో అటు నాదెండ్ల ప్రస్తావన అదేవిధంగా లక్ష్మీపార్వతి ప్రస్తావన లేకుండా ఎన్టీఆర్ బయోపిక్ ఏమిటి అని తేజ ప్రశ్నించిన నేపధ్యంలో ఆభేదాభిప్రాయాలు పెద్దవిగా మారి తేజ నిష్క్రమణకు దారితీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న కొర్రపాటి సాయి తేజాను బుజ్జగించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆప్రయత్నాలు సఫలం కాలేదని వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలాఉండగా ఈబయోపిక్ దర్శకత్వం వహించాలని బాలకృష్ణ ఆలోచనలు ఉన్నా బయోపిక్ దర్శకత్వం వహించడానికి ఎంతో రీసెర్చ్, ఓపిక, నేర్పు, సహనం కావాలసిన నేపధ్యంలో బాలయ్య ఈదర్శకత్వ బాధ్యతలకు సరిపోడు అని బాలకృష్ణ సన్నిహితులే బాలయ్యకు నచ్చచెపుతున్నట్లు టాక్. దీనికితోడు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ యంగ్ ఏజ్ సీన్లతో సమస్య ఉన్న నేపధ్యంలో బాలయ్య యంగ్ ఏజ్ క్యారెక్టర్ కు సరిపోని నేపధ్యంలో ఆ కేరెక్టర్ కు ఏపేరును సూచించినా బాలకృష్ణకు నచ్చడంలేదు అన్నవార్తలు వస్తున్నాయి. 

ఈపాత్రకు అన్నివిధాల జూనియర్ సరిపోయినా జూనియర్ ప్రస్తావన వినడానికి కూడ బాలయ్య అంగీకరించడం లేదు అని టాక్. దీనికితోడు ఈసినిమాలో అత్యంత కీలకమైన ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రతో పాటు ఇంకా అనేకపాత్రల ఎంపికలో బాలయ్య అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈపరిస్తుతుల నేపధ్యంలో ప్రస్తుతం బాలయ్య మనసులో రాఘవేంద్రరావు కృష్ణవంశీ పూరి జగన్నాథ్ తమిళ దర్శకుడు పి. వాసు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కుదరకపోతే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి ఒకనాటి ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ పర్యవేక్షణలో బాలయ్య ఈబయోపిక్ ను పూర్తి చేయాలి అని భావిస్తున్నట్లు టాక్. ఒకవైపు రాఘవేంద్రరావు లాంటి సన్నిహితులు ఎన్టీఆర్ బయోపిక్ ను క్యాన్సిల్ చేయమని సలహాలు ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నా ఎవరి సలహాలు ఈబయోపిక్ విషయంలో వినే స్థితిలో ప్రస్తుతం బాలయ్య లేడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: