సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో మొదటి రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాలో మరో సాంగ్ వచ్చాడయ్యో సామి అనే పాట కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. అనుకున్నట్టుగానే దేవి మార్క్ చూపించేలా ఈ సాంగ్ వచ్చింది.
సీమ అందాలు.. పల్లెటూరి గొప్పతనం చెప్పేలా ఈ పాట సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించగా.. కైలాష్ ఖేర్, దివ్య కుమార్ ఆలపించడం జరిగింది. మంచి సాహిత్యం అంతకుమించిన మ్యూజిక్ తో ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇలా సాంగ్ రిలీజ్ అయ్యిందో లేదో అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఈ సాంగ్.
మహేష్ సిఎంగా నటిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 7న ఎల్.బి స్టేడియంలో ఈ సినిమా బహిరంగ సభ అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. చీఫ్ గెస్టులుగా ఎన్.టి.ఆర్, రాం చరణ్ వస్తున్నారని టాక్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే సినిమా సగం హిట్ అన్నట్టే.
భరత్ సాంగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఏప్రిల్ 20న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న భరత్ అనే నేను ఎలాంటి హంగామా సృష్టిస్తాడో చూడాలి. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపుల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. మరి అది ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.