చరణ్ మాటలకు రంగస్థలం పై బయ్యర్లకు అనుమానాలు !

Seetha Sailaja
‘రంగస్థలం’ క్రేజ్ తారాస్థాయికి చేరుకోవడంతో ఆ క్రేజ్ ను భారీ కలెక్షన్స్ గా మార్చుకోవడానికి   రంగంలోకి దిగిన రామ్ చరణ్ మీడియాకు వరస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే చరణ్ ఈ ఇంటర్వ్యూలలో చెపుతున్న విషయాలు ఈసినిమాను అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లకు ఆందోళన కలిగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

తన తండ్రి చిరంజీవి ఒక పక్క కమర్షియల్ చిత్రాలు చేస్తూనే ‘ఆపద్భాంధవుడు’ ‘స్వయంకృషి’ చేసారు ఈ సినిమాను చూసి తన తల్లి కన్నీరు పెట్టుకుంది అని అనడమే కాకుండా ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ తనను ఈసినిమా చేసేముందు తమిళంలో మరీ నాటుగా తీసిన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాలు తనను చూడమని చెప్పాడు లాంటి మాటలను చరణ్ ఇంటర్వ్యూలలో చూస్తున్న బయ్యర్లకు నిద్ర కూడ పట్టని పరిస్థితి అని టాక్.  ఇలాంటి మాటలను చరణ్ ఇస్తున్న ఇంటర్వ్యూ లలో చూసిన ఈమూవీ బయ్యర్లు ఈ మూవీ మాస్ కమర్షియల్ సినిమాగా అందరికీ నచ్చుతుందా? లేకుంటే ఈమూవీ అవార్డుల సినిమాగా మారిపోతుందా అని భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షలకు నచ్చకపోతే ఈమూవీకి రిపీట్ ఆడియన్స్ వచ్చే ఆస్కారం ఉండదని బయ్యర్లుభయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నిడివి రెండుగంటల 45నిమిషాలు ఉండటం కూడా బయ్యర్ల టెన్షన్ కు కారణం అని అంటున్నారు. ఈమూవీ కొనుక్కున్న బయ్యర్లు సేఫ్ గా నష్టాలు లేకుండా బయటపడాలి అంటే ఈమూవీకి 80 కోట్ల నెట్ కలక్షన్స్ రావాలి అని అంటున్నారు.

దీనికితోడు ‘రంగస్థలం’ విడుదల తరువాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా చాల సినిమాలు ప్రతివారం క్యూలో ఉన్న నేపధ్యంలో ఎటువంటి డివైడ్ టాక్ లేకుండా ‘రంగస్థలం’ కు మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ వచ్చే ఆస్కారం ఎంత వరకు ఉంది అన్న కోణంలో కూడ చర్చలు జరుగుతున్నాయి. చరణ్ ‘రంగస్థలం’ లాంటి సినిమాను చేయడంతో పాటు తననటనలో పరిణితి రావడానికి ఒక విధంగా ‘బ్రూస్ లీ’ పరాజయం కారణం అంటూ చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నేపధ్యంలో ‘రంగస్థలం’ లాంటి సినిమాను చరణ్ చేయడానికి ఒకవిధంగా శ్రీనువైట్ల కారకుడా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: