కాబోయే మొగుడి గురించి చెప్పిన నయన్..!

Edari Rama Krishna
తెలుగు, తమిళ,మళియాళ ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా తన అందాలతో మంత్రముగ్ధులను చేస్తుంది నయనతార.  పేరుకు తగ్గట్టుగానే నయనానందంగా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ ‘చంద్రముఖి’ చిత్రంలో రజినీ సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.  ఆ తర్వాత సూర్య నటించిన గజిని చిత్రంలో హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్ల మనసు దోచింది.  ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్లోకి వెళ్లింది.  దక్షిణాది ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార కావడం విశేషం. 

రీల్ లైఫ్ లో ఎంతో అందమైన పాత్రల్లో నటించిన నయనతార రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమ విషయంలో ఇబ్బందులు పడింది.  మొదట తమిళ హీరో శింబు, తర్వాత దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవ తో ప్రేమాయణం నడిపించింది.  ఒకదశలో ప్రభుదేవ  తో పెళ్లి పీటల వరకు వెళ్లినా..అదికాస్త క్యాన్సల్ అయ్యింది.  ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ ప్రేమలో ఉంది.

ది హిందూ' ఆంగ్ల దినపత్రిక నిన్న చెన్నైలో నిర్వహించిన 'వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018' అవార్డుల ప్రదానోత్సవంలో సౌతిండియా లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార తనకు కాబోయే భర్త ఎవరో చెప్పేసింది.  నటనా రంగంలో ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్న ఈ మలయాళ కుట్టి...తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది.

తనకు కాబోయే భర్త (విఘ్నేశ్‌ని ప్రస్తావిస్తూ)కి కూడా కృతజ్ఞతలు తెలిపింది.  'నానుమ్ రౌడీ ధాన్ (తెలుగులో నేనూ రౌడీనే)' చిత్రం షూటింగ్ సందర్భంగా విఘ్నేశ్-నయన్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటల వరకు వెళ్లబోతోంది.

మొత్తానికి విఘ్నేశ్‌ కృతజ్ఞతలు చెప్పడంతో...ఇంతకాలంగా నయనతార పెళ్లి చేసుకోబోయేది విఘ్నేశ్‌నా? కాదా? అన్న డౌటు  క్లీయర్ అయ్యింది. ప్రస్తుతం నయనతార ప్రస్తుతం చిరంజీవి 'సైరా' చిత్రంలో నటిస్తోంది. ఇక ఆమె నటించిన 'కర్తవ్యం' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: