సుకుమార్ తో రాం చరణ్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ లో అంచనాలు మొదలయాయి. ఇక ఆ సినిమాకు రంగస్థలం అన్న టైటిల్ పెట్టి ఇంకాస్త హోప్ పెంచేశారు. ఇక సినిమా ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ఇలా అన్ని ఒకదానికిమించి మరొకటి ఉండగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా ట్రైలర్ కూడా వదిలేశారు.
ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ రచ్చ మొదలు పెట్టగా.. సగటు సిని అభిమాని కూడా రంగస్థలం మెచ్చేలా చేశాడు సుకుమార్. ముఖ్యంగా చరణ్ నటన ఇదవరకు ఎప్పుడు ఈ రేంజ్ లో చూడలేదు. కచ్చితంగా ఇది చరణ్ కు ఓ మైల్ స్టోన్ మూవీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. అంతేకాదు రాం చరణ్ నట విశ్వరూపంతో ఈ సినిమా వస్తుందని కన్ఫాంగా అనొచ్చు.
సినిమా కథ కథనాలు ఎలా ఉన్నా అందమైన పల్లెటూరి కథని చెప్పేలా సుకుమార్ చేసిన ప్రయత్నం కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని అనిపిస్తుంది. ఇక సినిమాలో మరో హైలెట్ సమంత రామలక్ష్మిగా నటించడమే. చరణ్ తో పాటుగా కెరియర్ లో ఇలాంటి పాత్ర ఎప్పుడు చేయని సమంత.. తను కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో బలం అవగా.. సినిమా ఎక్కడ రాజి పడకుండా నిర్మించిన నిర్మాతల పెట్టుబడి కనిపిస్తుంది. రంగస్థలం ట్రైలర్ హిట్ సినిమా ట్రైలర్ అని అనేయొచ్చేమో. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ రంగస్థలం బాక్సాఫీస్ రణ రంగంలో ఎలాంటి బీభత్సాలను సృష్టిస్తుందో చూడాలి.