బన్నీ నిర్ణయాలతో నాపేరు సూర్యకు సమస్యలు !

Seetha Sailaja
ఈ సమ్మర్ రేస్ కు రాబోతున్న సినిమాలు అన్నింటిలోకి అల్లుఅర్జున్ ‘నాపేరు సూర్య’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో వచ్చిన ఏసినిమాలోను లేనటువంటి దేశభక్తి నేపధ్యంలో నిర్మింపబడుతున్న ఈమూవీని బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చాలని దర్శకుడు వక్కంతం వంశీతో పాటు అల్లు అర్జున్ కూడ చాలా కష్ట పడుతున్నారు.  

తన సినిమాలో పాటలు ఫైట్ల విషయంలో చాలా కేర్ తీసుకునే బన్నీ ఈమూవీలోని పాటలు ఫైట్లు వైవిధ్యంగా ఉండాలని అనేకప్రయత్నాలు చేస్తున్నాడు ఈనేపధ్యంలో ‘నా పేరు సూర్య’ సినిమాలో ఒక పాట కోసం అల్లుఅర్జున్ అనుసరిస్తున్న వ్యవహార శైలి ఈమూవీకి అనుకోని సమస్యలు తెచ్చిపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో ఈసినిమాకు సంబంధించి ఇంకా చిత్రీకరించవలసిన ఒక పాట పై బన్ని విపరీతమైన శ్రద్ద  కనపరుస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

ఈపాట చిత్రీకరణ  కోసం నేషనల్ వైడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ని అలాగే ఇంటర్నేషనల్ ఫేమ్ వీడియో ఆల్బమ్ మేకర్ని ప్రత్యేకంగా హైదరాబాద్ కు తీసుకు వచ్చారని తెలుస్తోంది. ఈటీమ్ తో బన్నీ  ఏకంగా 8 రోజులు రిహార్సల్ చేస్తాడట. అలాచేసిన తరువాత మాత్రమే అమెరికా వెళ్లి అక్కడ ఆ సాంగ్ షూట్ చేస్తారని టాక్ కేవలం షూట్ చేయడమే కాదు ఆపాటకు సంబంధించిన వర్క్ అంతా అమెరికాలోనే పూర్తి చేస్తారట.

ఈపరిస్థితుల నేపధ్యంలో ఏకంగా అల్లుఅర్జున్  ఏడెనిమిది రోజులు రిహార్సల్ చేయడం వల్ల ‘నా పేరు సూర్య’ రెగ్యులర్ షూట్ కు అంతరాయం కలుగుతోంది అని వార్తు వస్తున్నాయి. దీనితో ఈసినిమా షూటింగ్ షెడ్యూల్ మరో 10రోజులు వెనకపడుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీని మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేయాల్సి ఉండడం వల్ల ఏప్రియల్ ఫస్ట్ వీకెండ్ కు సెన్సార్  చేయించాల్సిన అవసరం ఉంది అని తెలుస్తోంది.  ఇప్పడు అల్లుఅర్జున్ ఈమూవీలో ఒక పాట కోసం చేస్తున్న రిహర్సల్స్ వల్ల ఈ సినిమాను అనుకున్న విధంగా పూర్తిచేసి ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్ కు విడుదలచేయగలనా అని వక్కంతం వంశీ తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: