త్రివిక్రం కోసం ఎన్టీఆర్ షాకింగ్ లుక్.. మరీ ఇంత సన్నబడ్డాడేంటి..!

shami
త్రివిక్రం ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత ఎన్నో మాటలు పడ్డ త్రివిక్రం తన సత్తా చాటడానికి వస్తున్నాడు. ఇక ఈ సినిమా దసరా మరిలో దించాలని చూస్తున్నారట.


ఈ సినిమాలో కుర్రాడిలాగా తారక్ కనిపిస్తాడట. అందుకోసం ఇప్పటికే జిం చేస్తున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా తారక్ ను వెయిట్ లాస్ అవమని సూచించాడట త్రివిక్రం అందుకోసం జిం ట్రైనర్ పాయిడ్ స్టీవెన్స్ సూచనల మేరకు తన బాడీ షేప్ మార్చుకున్నాడట. ఇక ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఎలా ఉన్నాడో ఓ పిక్ లీక్ అయ్యింది. 


ఇది చూసిన ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. జై లవ కుశలో కరెక్ట్ పర్సనాలిటీతో ఉన్న తారక్ ను త్రివిక్రం ఎందుకు మేకోవర్ చేస్తున్నాడో అంటున్నారు. క్యారక్టర్ డిమాండ్ చేస్తే ఫిజిక్ విషయంలో చేంజెస్ కంపల్సరీ. అందుకే తారక్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే ఎన్.టి.ఆర్ మరీ సన్నిబడ్డాడని కామెంట్లు వస్తున్నాయి. 


త్రివిక్రం తమ హీరోని ఏం చేస్తాడో అని ఫ్యాన్స్ కు ఓ భయం పట్టుకుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ లు హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారు. అనిరుద్ ను తొలగించి తమన్ కు సినిమా మ్యూజిక్ ఛాన్స్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: