శ్రీదేవి మృతి పై అరబ్ పత్రిక ఆసక్తికర కథనం !

Seetha Sailaja
అతిలోకసుందరి శ్రీదేవి మృతి మన ఇండియన్ మీడియాకు మాత్రమే కాకుండా దుబాయ్ లోని అరబ్ మీడియాకు కూడ హాట్ టాపిక్ గా మారడంతో ఒక అరబ్ దినపత్రిక శ్రీదేవి మృతి పై ఆసక్తికర కథనాన్ని ప్రచురించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో ఆమె మరణం పై ఆమె సన్నిహితులు కొందరు లేటెస్ట్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

దీనికితోడు శ్రీదేవి సోదరి శ్రీలత తనకు శ్రీదేవి మరణం పై అనుమానాలు ఉన్నాయి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఆమె మృతదేహం చూసిన తరువాత తాను మీడియా ముందు తన అనుమానాలను బయటపెట్టబోతున్నాను అని ప్రకటించడం మరింత సంచలనంగా మారింది.  దీనికితోడు ఆమె మృతి చెందిన 36 గంటలకు దుబాయ్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడం పై డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు. 

అదేవిధంగా శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించలేదు అని అరబ్ మీడియా వార్తలు వ్రాస్తోంది అంటూ ఒక ప్రముఖ చానల్ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా ఆమె మృతదేహాన్ని మొదటగా హోటల్ సిబ్బందే గుర్తించారన్నది మరో లేటెస్ట్ న్యూస్. పోలీసుల విచారణ జరుగుతుండడంతో ఈ వ్యవహారంపై హోటల్ సిబ్బంది నోరు మెదపడంలేదు అని అంటున్నారు. 

మరోవైపు అతిలోక సుందరి మృతి చెందినప్పుడు బోనీకపూర్ ఇండియాలోనే ఉన్నట్లు మరోవైపు వార్తలు జోరందుకుంటున్నాయి. ఇది ఇలా ఉండగా ఆమె లైఫ్ ఇన్సూరెన్స్ పోలసీ 50 కోట్ల భారీ మొత్తానికి ఉంది అన్న మరో బ్రేకింగ్ న్యూస్ ను మరో ఛానల్ వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈమధ్య కాలంలో పూణేలో ఉన్న అత్యంత విలువైన ఒక స్థలాన్ని బోనీ కపూర్ శ్రీదేవి అభిప్రాయానికి విరుద్ధంగా అమ్మినట్లు దీనివల్ల శ్రీదేవి మనస్థాపానికి గురైనట్లుగా కూడ వార్తలు వస్తున్నాయి. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ రూమర్స్ పై బోనీ కపూర్ కానీ మరి ఏ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ స్పందించక పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్న విషయాలుగా మారి సంచాలననాలను సృష్టిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: