నెగిటివ్ ప్రచారంలో చిక్కుకున్న అల్లు బ్రదర్స్ !

frame నెగిటివ్ ప్రచారంలో చిక్కుకున్న అల్లు బ్రదర్స్ !

Seetha Sailaja
గత కొంత కాలంగా ఇండస్ట్రీ వర్గాలలో అల్లుఅర్జున్ అతడి సోదరుడు అల్లు శిరీష్ ను టార్గెట్ చేస్తూ ప్రచారంలోకి వస్తున్న వార్తల వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో 'చెప్పను బ్రదర్‌' అంటూ గొడవకి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్‌ ఇప్పుడు పవర్‌స్టార్‌ అభిమానుల నుంచి పూర్తి స్థాయి నాన్‌ కోపరేషన్‌ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.   
ALLU ARJUN LATEST PHOTOS NAA PERU SURYA MOVIE కోసం చిత్ర ఫలితం

దీనికితోడు రామ్ చరణ్‌ ప్లానింగ్‌ కి బన్నీ అడ్డు తగులుతున్నాడంటూ మీడియా మేనేజ్‌ మెంట్‌ తో మెగా ఫ్యామిలీకి తదుపరి మెగాస్టార్‌ తానే అన్నట్టు చూపించుకుంటున్నాడంటూ సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్‌ అభిమానుల నుంచి కూడ బన్నీ పై వ్యతిరేక ప్రచారం కూడ ప్రస్తుతం తీవ్రస్థాయిలో జరుగుతోంది. దీనికితోడు అల్లుఅర్జున్ తన సినిమాలకు పబ్లిక్‌ వేడుకల్లో డిక్టేటర్‌ మాదిరి ప్రవర్తనతో తరచుగా అభిమానుల పై ఆవేశపడుతూ తన శత్రువులను బన్నీ మరింత పెంచుకుంటున్నాడు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.   
ALLU SIRISH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

లేటెస్ట్ గా  'నా పేరు సూర్య' వర్సెస్‌ 'భరత్‌ అనే నేను' విడుదల తేదీకి సంబంధించిన వివాదంలో  మహేష్‌ ఫాన్స్‌ కి కూడా బన్ని మరింత శత్రువయ్యాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిట్ట చివరకు ఈ సినిమాల రిలీజ్ డేట్ వివాదం సర్దుబాటు జరిగినా మహేష్ బన్నీల మధ్య ఈగో క్లాష్‌ వారి అభిమాను ల వరకు విస్తరించింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈవిశాయానికితోడు ఈ మధ్య అల్లు శిరీష్ పై జరుగతున్న నెగిటివ్ ప్రచారం కూడ చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది.

ప్రస్తుతం అల్లు శిరీష్ తనతో సినిమాలు చేస్తున్ననిర్మాతలను  టార్చర్ చేస్తున్నాడు అన్న గాసిప్పులు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ నిర్మాతతో కూడ అల్లు శిరీష్ కు ఇగో సమస్యలు మొదలు అయ్యాయి అన్న గాసిప్పుల హడావిడి విపరీతంగా జరుగుతోంది. దీనితో అల్లు బ్రదర్స్ ను టార్గెట్ చేస్తూ ఇప్పుడు జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారానికి సరైన అడుకట్ట వేయలేకపోతే భవిష్యత్ లో ఈ అల్లు బ్రదర్స్ ఇద్దరు తమ కెరియర్ పరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురు అవుతాయి అన్న ప్రచారం జరుగుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: