నాది ప్రేమపెళ్లే.. కీర్తి సురేష్ మనసులో మాట..!

shami
మలయాళ భామలకు తెలుగులో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు స్టార్స్ అంటే మోడల్స్ నుండి దిగుమతి చేసుకునే వారు కాని ఇప్పుడు మలయాళంలో ఆల్రెడీ టాలెంట్ చూపిన భామలను తెలుగులో స్టార్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వాళ్లంతా మలయాళ భామలే అని చెప్పాలి.


ఇక వారి వరుసలో స్టార్ అవకాశాలను అందుకుంటున్న భామ కీర్తి సురేష్ ముందుంది. నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తర్వాత వచ్చిన నేను లోకల్ తో కూడా మరో హిట్ కొట్టింది. అందం అభినయం మన పక్కింటి అమాయే అన్నట్టుగా ఉండే కీర్తి సురేష్ తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. 


ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే తన మ్యారేజ్ విషయాలను ప్రస్తావిస్తే మాత్రం అమ్మడు నాది లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని షాక్ ఇచ్చింది. తన తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లిచేసుకున్నారని.. తన సోదరిది కూడా ప్రేమ పెళ్లే అని చెబుతూ తాను కూడా ప్రేమించి పెళ్లిచేసుకుంటానా లేక అరేంజెడ్ మ్యారేజ్ చేసుకుంటానా అన్నది చెప్పలేనని అంటుంది కీర్తి.


ఇప్పటికైతే సినిమాల మీదే ఫుల్ ఫోకస్ పెడుతున్నా అని చెప్పిన కీర్తి సురేష్ తన మనసుకి నచ్చిన వాడు ఇంకా తారసపడలేదు అని చెప్పింది. అలాంటి వాడు వస్తే తప్పకుండా ఆలోచిస్తా అంటుంది. మరి లవ్ మ్యారేజ్ పై ఇంత ఓపెన్ గా చెబుతున్న అమ్మడికి లవ్ అప్లికేషన్స్ ఎన్నోస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: