పట్టు తప్పిన కోరటాల స్ట్రాటజీతో మహేష్ కు టెన్షన్ !

Seetha Sailaja

ప్రిన్స్ మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటిస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ డైరెక్షన్ విషయంలో కొరటాల స్ట్రాటజీ పట్టు తప్పింది అన్న విషయం మహేష్ దృష్టి వరకు వెళ్ళడంతో మహేష్ ప్రస్తుతం తెగ టెన్షన్ పడిపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్‌లో ఉన్న లోపాలో లేక అనుకున్న విధంగా రాలేదో అన్న విషయం పై క్లారిటీ లేదు కానీ 'భరత్ అనే నేను' లో కొన్ని సీన్స్ రీషూట్ చేయడానికి కొరటాల సిద్ధమైపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఇటీవల తెరకెక్కించిన అసెంబ్లీ సన్నివేశాలు కొరటాలకు నచ్చలేదట. రషెస్ చూశాక ఆ సీన్స్‌లో 'లీడర్' సినిమా ఛాయలు కనిపించడంతో వెంటనే స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో ప్రస్తుతం కొరటాల బిజీగా ఉన్నట్లు టాక్. కథలో కీలకంగా ఉండే ఈ సీన్స్‌పై వేరే సినిమాల ఛాయలు కనిపించకుండా కొరటాల ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

అయితే ఈసినిమాకు సంబంధించిన అసెంబ్లీ సీన్స్ రీషూట్ తో కొరటాల సరిపెడతాడా ? లేదంటే ఈమూవీ స్క్రిప్ట్ లో మరిన్ని భారీ మార్పులు తీసుకువస్తాడా ? అన్న విషయమై రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి ఈ సమస్యలు రావడానికి కొరటాల స్క్రిప్ట్ ముందే పక్కాగా రాసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వరస పరాజయాలతో సతమతమైపోతున్న మహేష్ కు హిట్ ఇవ్వాలి అన్న ఒత్తిడి కూడ కొరటాలను ఈవిధంగా కన్ఫ్యూజ్ చేస్తోంది అని అంటున్నారు.

 

ఈ రీషూట్స్ కారణంగా నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో ఈసినిమా బయ్యర్లు తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఈ సినిమా టైటిల్ పై కూడ కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపద్యంలో ప్రస్తుతానికి ‘భరత్ అనే నేను’ నిర్మాణ వ్యవహారాలు కొంత మేర గందరగోళ పరిస్థుతులలో ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: