యువ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ మూవీ కిర్రిక్ పార్టీ రీమేక్ గా వస్తున్న సినిమా కిర్రాక్ పార్టీ. శరణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. నిఖిల్ మొదటిసారి మాస్ ఇమేజ్ తో ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది. సంయుక్త హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నిఖిల్ మాస్ లుక్ లో కనిపిస్తాడని అర్ధమవుతుంది. కన్నడలో 175 రోజులు ఆడి చరిత్ర సృష్టించిన కిర్రిక్ పార్టీ సినిమా కచ్చితంగా ఇక్కడా కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇద్దరు క్రేజీ డైరక్టర్స్ ఈ సినిమాకు సపోర్ట్ అందించడమే అని చెబుతున్నారు.
సుధీర్ వర్మ స్క్రీన్ ప్లేలో చందు మొండేటి మాటల సహకారంతో తెలుగు కిర్రాక్ పార్టీ వస్తుందట. సినిమాతో నిఖిల్ పూర్తి మేకోవర్ ఉంటుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగా సినిమా కూడా కచ్చితంగా నచ్చేస్తుందని అంటున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో నిఖిల్ కెరియర్ హిట్ ట్రాక్ ఎక్కేస్తుందేమో చూడాలి. ఓ పక్క యువ హీరోలంతా దూసుకెళ్లిపోతున్న నేపథ్యంలో కిర్రాక్ పార్టీ తో సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు నిఖిల్.