షాకింగ్ చైతూ సమంతల నిరాడంబర పెళ్ళికి పది కోట్ల ఖర్చు !

Seetha Sailaja
నాగచైతన్య ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ సమంతతో తన పెళ్లి చాల నిరాడంబరంగా జరుగుతుంది అని చెప్పాడు. దీనికితోడు సమంతకు కూడ విలాసాలు ఇష్టం లేదు అన్న విషయాన్ని స్పష్టం చేసాడు. అయితే ఈ సింపుల్ పెళ్ళికి ఇప్పుడు 10 కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

గత కొంత కాలంగా టాలీవుడ్ ప్రేమ జంటగా హడావిడి చేసిన నాగాచైతన్యా సమంతలు గోవాలో ఈనెల 6వ తారీఖున పెళ్ళి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ పెళ్ళి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులు కొందరు గోవాలోని ఈపెళ్ళి జరిగే డబ్ల్యూ రిసార్ట్ కు చేరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అక్టోబర్ 6వ తారీఖున హిందు సాంప్రదాయంలో 7వ తారీఖున క్రిష్టియన్ సాంప్రదాయంలో జరిగే ఈ పెళ్ళికి అతిధులు అంతా 5వ తారీఖుకే గోవా చేరుకుంటారని తెలుస్తోంది. మొదటి నుంచి ఈ పెళ్ళి చాల నిరాడంబరంగా జరుగుతుంది అని అక్కినేని కుటుంబ సభ్యులు చెపుతూ ఉన్నా ఈ పెళ్ళికి 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని తెలుస్తోంది. 

దాదాపు 150 మంది అతిధులు పాల్గొనబోతున్న ఈ పెళ్ళికి సంబంధించి వస్తున్న అతిధుల రానుపోను ఖర్చులు వారి ఎకామిడేషన్ కోసం తీసుకున్న విలాసవంతమైన హోటల్స్ ఖర్చులు వారికి ఇచ్చే బహుమతులు అన్నీ కలుపుకుంటే కనీసం పది కోట్ల ఖర్చుగా మారబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరుకు భాగ్యనగరంలో సమంత చైతన్యల పెళ్ళి రిసెప్షన్ అత్యంత ఘనంగా జరపడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రామ్ చరణ్ అతడి భార్య రానా వెంకటేష్ రాహుల్ రవీంద్రన్ లతో పాటు అతి కొద్దిమంది టాలీవుడ్ సెలెబ్రెటీలు పాల్గొనే ఈ పెళ్ళిలో ఎక్కువ మంది చైతన్యా సమంతల కుటుంబ సభ్యులే ఉంటారని టాక్. సింపుల్ పెళ్ళిగా పేరుగాంచిన సమంత – చైతన్యల పెళ్ళి ఈ స్థాయిలో ఉంటే ఘనంగా నిర్వహింపబడే రిసెప్షన్ మరింక ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: