త్రివిక్రమ్ నిర్ణయానికి అసంతృప్తిలో పవన్ అభిమానులు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ మూడవసారి నిర్మాణంలో ఉన్న లేటెస్ట్ మూవీకి సంబంధించి ఒక టైటిల్ లీక్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ‘రాజు వచ్చినాడు’ అన్న టైటిల్ ఈమూవీకి ఫిక్స్ చేసారని ఈ టైటిల్ లోగోతో పాటు ఈమూవీ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి దర్శకుడు త్రివిక్రమ్ ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈ టైటిల్ వ్యవహారం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం జూనియర్ ‘దమ్ము’ సినిమాకు సంబంధించిన చేదు జ్ఞాపకాలు అని అంటున్నారు. 

ఈమూవీలో ‘రాజు వచ్చినాడు’ అనే టైటిల్ సాంగ్ ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈపాట అప్పట్లో ప్రజాదరణ పొందినా జూనియర్ కెరియర్ లో గుర్తించుకో దగ్గ భారీ ఫ్లాప్ గా మారిపోయింది. ఇప్పుడు ఈవిషయాలు గుర్తుకు వచ్చి పవన్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు టాక్. 

అంతేకాదు పవన్ త్రివిక్రమ్ ల క్రేజీ మూవీకి జూనియర్ సినిమాలోని పాటల పదాలను కాపీ కొట్టవలసిన పరిస్థుతులు ఎందుకు వచ్చాయి అంటూ పవన్ అభిమానులు తమలోతాము తీవ్ర అసహనానికి గురి అవుతున్నట్లు టాక్. దీనికితోడు మాటల మాంత్రికుడుగా పెరుగాంచిన త్రివిక్రమ్ ఎన్నో ఆలోచనలు చేయగల సమర్ధత ఉన్నా జూనియర్ ఫెయిల్యూర్ సినిమా సెంటిమెంట్ పవన్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీకి హాని చేస్తుందని పవన్ అభిమానులు అప్పుడే ఈ ‘రాజు వచ్చినాడు టైటిల్ పై అప్పుడే నెగిటివ్ కామెంట్స్ మొదలు పెట్టేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: