ప్రభాస్ రానాల మధ్య సాన్నిహిత్యాన్ని ‘బాహుబలి’ ప్రాజెక్ట్ ఎంతగానో పెంచింది. ఈమూవీ కోసం వీరిద్దరూ 5 సంవత్సరాలు కష్టపడి కలిసి పనిచేయడంతో వీరిద్దరూ ఒకరినొకరు ప్రస్తుతం ‘బావా’ అని అప్యాయంగా పిలుచుకునే సాన్నిహిత్యంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా ప్రభాస్ తో తన సాన్నిహిత్యం గురించి వివరిస్తూ ప్రభాస్ కు ఉన్న బలహీనత పై కూడ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
రానా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయంతెలిసిందే. తన పై ఎన్నో రూమర్స్ వచ్చినా అవి పట్టించుకోకుండా రానా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా తన ట్విటర్ ద్వారా తన అభిప్రాయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉండటం రానా అలవాటు. ఇలా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తరుచు అందుబాటులోకి వచ్చె రానా ఈమధ్య తన లేటెస్ట్ మూవి ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒక అభిమాని దగ్గర నుంచి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ను సోషల్ మీడియాలోకి తీసుకు రావచ్చు కదా అన్న అభిమాని ప్రశ్నకు సమాధానం ఇస్తూ రానా తాను ఏ విషయంలో అయినా ప్రభాస్ ను ఒప్పించగలను కాని సోషల్ మీడియా విషయంలో మాత్రం ప్రభాస్ అభిప్రాయాలను తాను మార్చలేను అంటూ ఆ శక్తికర కామెంట్స్ చేసాడు. అంతేకాదు ప్రభాస్ పేరు పై ఫేస్ బుక్ లో ఒక పేజీ ఉన్నా ఆ పేజీలోని విషయాలను ప్రభాస్ టీమ్ మేనేజ్ చేస్తుంది కాని ఆ విషయాలను ప్రభాస్ పట్టించు కోడు అన్న విషయాలను బయట పెట్టాడు రానా
అంతేకాదు ప్రభాస్ కు ఉన్న బిడియం వల్ల ప్రభాస్ కు జనంతో తరుచుకలుస్తూ తన అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు అని అంటూ ఈమనస్తత్వం వల్ల ప్రభాస్ సోషల్ మీడియాలో తనలా యాక్టివ్ గా ఉండే అవకాశాలు చాలా తక్కువ అని అభిప్రాయ పడ్డాడు రానా. దీనితో చాలామంది టాప్ హీరోలు లా ప్రభాస్ ను సోషల్ మీడియా కింగ్ గా చూసే ఆస్కారం ప్రభాస్ అభిమానులకు ఇప్పట్లో లేదనే అనుకోవాలి..