నాగచైతన్యకు ఇప్పుడు అన్ని విషయాలు బాగా కలిసివస్తున్నాయి. రెండు వరాల క్రితం విడుదలైన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఇప్పటి వరకు 35 కోట్ల కలక్షన్స్ వసూలు చేయడంతో చైతు కెరియర్ లో ఈమూవీ మొట్టమొదటి 40 కోట్ల సినిమాగా మారే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో అక్కినేని కాంపౌండ్ మంచి జోష్ లో ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సమంతో ఎంగేజ్ మెంట్ జరిగిన తరువాత మొట్టమొదటి భారీ హిట్ ను అందుకున్న చైతన్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాబోయే భార్య సమంత తన తల్లికి తరుచు ఫోన్ చేసి తన పై కంప్లైంట్స్ ఇస్తున్న విషయాన్ని బయట పెట్టాడు. సమంత ఈమధ్య తనతో కన్నా తన తల్లితో చాల చనువుగా ఉంటోందని వీరిద్దరు ప్రతిరోజు ఫోన్ చేసుకుని కనీసం ఒక గంటపాటు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారని ఆమాటల మధ్యలో తన పై లేనిపోని కంప్లైంట్స్ సమంత తన తల్లికి ఇస్తోంది అన్న విషయాన్ని బయట పెట్టాడు.
ఈమధ్య తన తల్లి చెన్నై నుండి వచ్చినప్పుడు సమంత తన తల్లిని కలిసి ఏవేవో విషయాలు చెప్పిందని జోక్ చేస్తూ ప్రస్తుతం వారిద్దరూ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు చైతు. ఆమధ్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం గురించి నాగార్జున, సమంతలిద్దరూ వాట్సప్‌లో చాటింగ్ చేసుకొన్న వ్యవహారం అక్కినేని అభిమానులు ఇంకా మర్చిపోకుండానే ఇప్పుడు సమంత చైతు తల్లితో సన్నిహితంగా మెలగడం అక్కినేని సన్నిహితులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న సమంత తన సినిమాలు అన్నింటిని త్వరగా పూర్తిచేసి అక్టోబర్ నెల ప్రాంతానికి పెళ్ళి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోంది. ఇంతకీ ఈమధ్య కాలంలో సమంత నాగచైతన్య పై అతడి తల్లికి ఇచ్చిన కంప్లైంట్స్ ఏమిటి అన్నది మాత్రం చైతన్య బయటపెట్టలేదు. ఏది ఏమైనా సమంత గోల్డెన్ లెగ్ ఎఫెక్ట్ చైతూకు కూడ అంటింది అనుకోవాలి..