దేవుడు శాసిస్తాడు.. రజిని పాటిస్తాడు..!

shami
టైటిల్ చూసి సూపర్ స్టార్ రజినికాంత్ అరుణాచలం డైలాగ్ కు కాస్త దగ్గరగా ఉంది కదా అనుకోవచ్చు. ఆ సినిమా డైలాగ్ ఎలా పెట్టారో తెలియదు కాని ప్రస్తుతం రజినికాంత్ మాత్రం దేవుడి మీద భారీ వేసి తన పొలిటికల్ ఎంట్రీపై కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. దేవుడు శాసిస్తే తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా అని రజిని చెప్పారు.. చెబుతూ వస్తున్నారు.


ఇక చాన్నాళ్ల తర్వాత రజినికాంత్ తో ఫ్యాన్స్ మీట్ నిన్న చెన్నైలో జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్య అజెండా ఏంటి అంటే రజినికాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించే. తాను రాజకీయాల్లోకి వస్తే సపోర్ట్ ఇవ్వడం లాంటివి చేయనని చెబుతున్న రజిని డైరెక్ట్ గా తను కూడా ఓ సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 


అంతేకాదు డబ్బు మదం ఉన్న వారికి తను చాలా దూరంగా ఉంటానని చెప్పిన రజిని తను ఒకవేళ రాజకీయాళ్లోకి వస్తే అలాంటి వారిని టార్గెట్ చేస్తానని చెప్పకనే చెప్పారు. ఇక సినిమాల గురించి వస్తే తాను తీయబోయే మాఫియా డాన్ సినిమా హాజి మస్తాన్ కథ అని అంటున్నారని దానికి వివరణ ఇచ్చుకున్నారు రజినికాంత్.


ఇక హిట్టొచ్చినా ఫ్లాపొచ్చినా తన వెంటే ఉండి.. తనతో ప్రయాణం చేస్తున్న అభిమానులకు ఎప్పుడు ఋణపడి ఉంటానని రజిని ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఫ్యాన్స్ మీట్ లో రజిని రాజకీయాల్లోకి రావాలనే విషయం మీదే పెద్ద చర్చ జరిగిందట. ఆ టైం వస్తే దేవుడు శాసిస్తాడని.. అప్పుడు తాను కచ్చితంగా రంగంలో దిగుతానని అభిమానులకు హామి ఇచ్చాడు సూపర్ స్టార్ రజినికాంత్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: