సినిమా రంగం అంటేనే గ్లామర్ తో పాటు ఇగోల మధ్య సతమతమైపోతుంది. ఇలాంటి పరిస్థుతుల వల్ల కోట్లాది రూపాయల ఖర్చుతో సినిమాలు తీసే నిర్మాతలు నష్టపోయిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. హీరో హీరోయిన్ దర్శకుడు కెమెరామెన్ ఇలా ఎవరు ఎవరికీ నచ్చకపోయినా సినిమా మధ్యలో మారిపోతున్న సందర్భాలు గతంలో అనేక సార్లు జరిగాయి. దీనివల్ల నిర్మాతలు ఎంతో నష్టపోతున్నా ఈవిషయాలను పట్టించుకునే స్థితిలో ప్రస్తుత టాలీవుడ్ పరిశ్రమ లేదు.
ఇప్పుడు మళ్ళీ అటువంటి సందర్భమే జూనియర్ నటిస్తున్న ‘జై ల కుశ’ సెట్స్ లో జరగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో నటిస్తుండగా, ఈ సినిమాకు ఫోటోగ్రఫీ అందించే బాధ్యతలను ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సి.కే.మురళీధరన్ నిర్వహించాడు.
ఈసినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. “పీకే, ‘3 ఇడియట్స్’, ‘మొహింజోదారో’, ‘లగే రహో మున్నాభాయ్’ వంటి సినిమాలకు ఫోటోగ్రఫీ విధులను నిర్వహించిన మురళీధరన్ కు ‘జై లవకుశ’ టీం సభ్యులకు మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలకు దర్శకుడు బాబీ కారణం అన్న వార్తలు వస్తున్నాయి.
ఈసినిమాకు సంబంధించి అన్నీ తాను చెప్పినట్లుగానే జరగాలి అని బాబీ చెపుతున్న మాటలు తట్టుకోలేక అర్ధాంతరంగా మురళీధరన్ వెళ్లిపోయడని తెలుస్తోంది.
వీరిద్దరిమధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు ‘జై లవ కుశ’ ఫైనల్ అవుట్ ఫుట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది అన్న ఉద్దేశ్యంతో కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకుని మురళీధరన్ స్థానంలో టాలీవుడ్ ఏస్ కెమెరామెన్ చోటా కే నాయుడును తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మార్పుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది.
సెట్స్ లో బాబీ మురళీధరన్ మధ్య తలెత్తిన ఈగో వలనే ఈ మార్పు జరిగిందని ట్రేడ్ వర్గీయుల విశ్వసనీయ సమాచారం. అయితే ఇవన్నీ రూమర్స్ అనీ జూన్ నుండి మురళీధరన్ వేరే బాలీవుడ్ సినిమాకు పనిచేయవలసిన పరిస్థుతులు ఏర్పడంతో ఈమార్పు జరిగింది అని కళ్యాణ్ రామ్ కవర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల పెట్టుబడితో సినిమాలు తీస్తున్న ప్రస్తుత పరిస్థుతులలో నిర్మాత పరిస్థితి గురించి ఆలోచించకుండా ఆ సినిమా యూనిట్ లో పనిచేసేవారు అంతా ఎవరికివారు తమ మాటల పట్టింపు గురించి యుద్దాలు చేయడం వల్లనే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..