పవన్ పిలుపుకోసం ఆశతో విజయేంద్ర ప్రసాద్ !

Seetha Sailaja
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రను తిరగ వ్రాసి 12 వందల కోట్ల కలక్షన్స్ ను దాటి 15 వందల కోట్ల వైపు పరుగులు తీస్తున్న ‘బాహుబలి’ ప్రాజెక్ట్ తో రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడ నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్న భారీ బడ్జెట్ మూవీ ‘మణికర్ణిక’ కు కూడ విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నాడు. 

ఈ సినిమాకు కథ అందించినందుకు విజయేంద్ర ప్రసాద్ కు 2 కోట్ల భారీ పారితోషికం ఆ సినిమా నిర్మాతలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో టాప్ హీరోలతో సమానంగా విజయేంద్ర ప్రసాద్ కు క్రేజ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో అనేక మీడియా సంస్థలకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 

ఇటీవల పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి ది కంక్లూజన్‌’ సినిమాలో కీలకమైన ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ కు పవన్‌ కల్యాణ్ స్ఫూర్తి అని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు పవన్‌ వ్యక్తిత్వం నిజాయితీ తనకెంతో ఇష్టమని విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో వీరిద్దరూ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందని అభిమానులందరూ చర్చించుకుంటున్నారు. 

ఈ ప్రశ్న విజయేంద్రప్రసాద్‌కు ఒక ఇంటర్వ్యూలో ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ పవన్‌తో కలిసి పనిచేయడం నాకిష్టమే అని చెపుతూ ఆయన కోసం తాను కథ రాస్తాను అన్న సంచలన విషయాన్ని బయట పెట్టాడు. 

దీనినిబట్టి చూస్తూ ఉంటే బహుశా వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు అని అనిపిస్తోంది. అయితే పవన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న నేపధ్యంలో విజయేంద్ర ప్రసాద్ వ్రాయబోయే కథలో నటించడానికి పవన్ కళ్యాణ్ కు తీరిక ఎక్కడా అన్నదే సమాధానం లేని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: