పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ నోటివెంట మళ్ళీ ఆర్ధిక కష్టాల ప్రస్తావన వచ్చింది. తాను నటించే ప్రతి సినిమాకు 20 కోట్లకు తక్కువ కాకుండా పారితోషికం తీసుకునే పవన్ ఈమధ్య తరుచు తన వద్ద డబ్బు లేదు అని చెపుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంలో నిన్న సాయంత్రం ‘జనసేన’ కార్యాలయంలో ఇంజినీరింగ్ విద్యార్ధులు పవన్ ను కలవడానికి వచ్చిన సమయంలోపవన్ నోటివెంట తనవద్ద డబ్బులేదు అన్న ప్రస్తావన మళ్ళీ వచ్చింది. మంత్రి నారాయణ కొడుకు నిశిత్ డ్రైవ్ చేస్తూ ప్రమాదం జరిగిన కారు మీదేనా ? అని ఓ విద్యార్థి ప్రశ్నించగా దానిపై పవన్ ఇచ్చిన వివరణ మరోసారి పవన్ కరెన్సీ కష్టాలను హైలైట్ చేసింది.
ఇక ఇదే కారు పవన్ అమ్మేస్తే దాన్ని ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిశిత్ కొనుగోలు చేశాడన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో పవన్ స్పందించాడు. ఇప్పుడు ప్రమాదం జరిగింది అడ్వాన్స్‌డ్ వెహికిల్ అంటూ పవన్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు అలాంటి వాహనం గతంలో తాను వాడానని కానీ నెలవారీ ఇంస్టాల్ మెంట్లు కట్టలేక ఆ కారు అమ్మేసానని అన్నాడు పవన్.
అయితే తాను వినియోగించిన వాహనం తదుపరి మోడల్ ను నిషిత్ కొనుగోలు చేసాడని వివరణ ఇచ్చాడు పవన్. పవన్ ఇచ్చిన సమాధానంతో రెండు విషయాలైతే స్పష్టమయ్యాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి నిషిత్ వాహనం పవన్ ది కాదని మరొకటి వాయిదాలు కట్టలేని ఆర్ధిక బాధల్లో పవన్ ఉన్నాడని. అయితే పవన్ నుండి ఆ సమాధానం వచ్చిన సమయంలో విద్యార్ధులు కూడా గొల్లున నవ్వారంటే పవన్ చెప్పిన జవాబు ఎంత నమ్మసక్యంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు అన్న కామెంట్స్ వినిపించాయి.
ఇదే సందర్భం లో పవన్ మాట్లాడుతూ ఉత్తరాది దక్షిణాది విభేదాల్ని తాను తెరపైకి తీసుకురావడంలేదనీ ఉత్తరాదితోపాటు దక్షిణాదికీ సమాన అవకాశాలు రావాలన్నదే తన డిమాండ్ అని క్లారిటీ ఇచ్చాడు. పవన్ నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ వల్ల ఇంజనీరింగ్ విద్యార్ధుల సమస్యలు ఎంతవరకు తీరుతాయో తెలియక పోయనా పవన్ తన వద్ద డబ్బు లేదు అని మరో సారి చెప్పుకునే అవకాశం కల్గించింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..