దర్శకుడు రాజమౌళి ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోవడంతో దేశవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతిని పొందుతున్నాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి మరో రెండు నెలలు తరువాత తన తదుపరి సినిమాల గురించి సీరియస్ గా ఆలోచనలు చేయాలని ఒక స్థిర నిర్ణయంలో ఉన్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా రాజమౌళి ‘బాహుబలి’ ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందు ఇద్దరు ప్రముఖ నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు ప్రస్తుతం రాజమౌళికి ఒక సమస్యగా మారాయి అని ఫిలింనగర్ గాసిప్.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రాజమౌళి ‘బాహుబలి’ ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందే ప్రముఖ నిర్మాతలు డివివి దానయ్యకు మరియు కేఎల్ నారాయణలకు చెరో సినిమా చేస్తానని కమిట్ అయి వారి వద్ద నుండి భారీ అడ్వాన్స్ లు తీసుకున్నట్లు ఫిలింనగర్ టాక్. అయితే వీరిద్దరూ రాజమౌళి ‘బాహుబలి’ ప్రాజెక్ట్ ముగిసే వరకు ఓపికతో వేచి చూసారు అన్న వార్తలు ఉన్నాయి.
ఇప్పుడు బాహుబలి ప్రాజెక్ట్ నుండి రాజమౌళి బయటకు రావడంతో ప్రస్తుతం ఈ ఇద్దరి నిర్మాతలు తమకు చెరొక సినిమా చేసి పెట్టమని రాజమౌళి పై ఒత్తిడి పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రాజమౌళి ఈ ఇద్దరి నిర్మాతలలో ఎవరో ఒకరి నిర్మాణ సంస్థలో తన తదుపరి సినిమాను ప్రారంభించవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.
సర్వ సాధారణంగా రాజమౌళి ఒక భారీ సినిమా తీసిన తరువాత్ ఎటువంటి అంచనాలు లేని ఒక చిన్న సినిమా తీయడం అలవాటుగా పెట్టుకున్నాడు కాబట్టి ముందుగా డి.వి.వి.దానయ్య సినిమాను ఒక చిన్న హీరోతో చేసి ఆ తరువాత కే.ఎల్.నారాయణ మహేష్ బాబుతో తీయబోయే సినిమాకు దర్శకత్వం వహించాలని ఒక మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లు టాక్. అయితే దానయ్య వ్యూహాత్మకంగా రాజమౌళి తీయబోయే సినిమాలో అల్లు అర్జున్ ను హీరోగా చేసి మరో భారీ ప్రాజెక్ట్ చేయాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో మరో ఆలోచన కూడ రాజమౌళికి ఉంది అని అంటున్నారు. రాజమౌళి ‘బాహుబలి’ తరువాత వెంటనే ప్రారంభించబోయే సినిమాకు అటు దానయ్యను ఇటు నారాయణను భాగస్వాములుగా చేసి వీలైనంత త్వరలో వారిద్దరికీ ఒక సినిమాను చేసి పెట్టి వారిద్దరికీ ఇచ్చిన మాటను నిలుపుకున్న వ్యక్తిగా మారి ఈ వ్యవహారం నుండి తెలిగిగా బయట పడాలని రాజమౌళి మరో ఆలోచన చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్..