రాజమౌళి టార్గెట్ తో ఇరుకున పడ్డ రజనీకాంత్ !

Seetha Sailaja
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ  చూసినా ‘బాహుబలి 2’ కు సంబంధించిన చర్చలే. ప్రస్తుతం ఈసినిమా కలెక్షన్స్ పరంగా సృష్టిస్తున్న సంచనలాలు ఒక కోత్త 'ట్రెండింగ్‌' గా మారడంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ లో ఇలా ఏసినిమా రంగంలో అయినా  ప్రస్తుతం కేవలం 'బాహుబలి'  గురించి మాత్రమే  మాట్లడుకుంటున్నారు. ఈ సినిమా సాధించిన ఘన విజయాన్ని చూసి దేశంలోని పెద్దపెద్ద విమర్శకులు కూడ ఈసినిమాలోని లోపాలను ఎత్తి చూపుతూ 'బాహుబలి' ని విమర్శించేందుకు కూడ  సాహసించడంలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనితో ఈసినిమాకు ఛాలెంజ్ విసిరేలా ఈ ఏడాది రాబోతున్న భారీ సినిమాల పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.  ఈచర్చలలో ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తున్న మూవీ 'పద్మావతి'.  అత్యంత భారీ సినిమాగా రూపొందుతున్న ఈమూవీ మహారాణి పద్మిని జీవిత కథ ఆధారంగా నిర్మింప బడుతోంది. ఇక బడ్జెట్ పరంగా ‘బాహుబలి 2’ తో పోటీ లేకపోయినా వచ్చే నెల రంజాన్ కు రాబోతున్న సల్మాన్ ఖాన్ 'ట్యూబ్‌లైట్‌' కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇప్పటి దాకా సల్మాన్ ఖాన్ పేరు మీద ఉన్న నెంబర్ వన్ రికార్డులను ‘బాహుబలి 2’ బ్రేక్ చేయడంతో సల్మాన్ రాజమౌళి పై ఏమైనా స్వీట్ రివెంజ్ తీర్చుకుంటాడ అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఏదైనా ఒక అద్భుతం జరిగితే తప్ప ఇప్పట్లో ‘బాహుబలి 2’ బ్రేక్ చేసే సినిమాలు వచ్చే అవకాసం లేదని స్వయంగా బాలీవుడ్ మీడియా అంగీకరిస్తోంది. 

ఇప్పుడు ఇటువంటి అయోమయమే టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడ ఉంది. త్వరలో విడుదల కాబోతున్న 'స్పైడర్‌', 'డిజె' పవన్‌ త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌ లో రానున్న మూవీల పై అంచనాలు ఉన్నా ఆసినిమాలు అన్నీ 100 కోట్ల కలక్షన్స్ దాటితే అద్భుతమే అని అంటున్నారు. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే 'బాహుబలి' తోపోటీ పడగల శక్తి కేవలం రజినీకాంత్  'రోబో 2.0' మూవీకి మాత్రమే ఉంది అన్నది సత్యం. అయితే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్న రజినీకాంత్ కు ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసే శక్తి సాదారణ ప్రేక్షకులు కలిగిస్తారా అన్నదే ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మారింది.

అయితే కథా పరంగా ‘బాహుబలి 2’ రజినీకాంత్ ‘2.0’ కు ఎటువంటి పోలికలు లేకపోయినా టెక్నాలజీ విషయంలో గ్రాఫిక్స్ విషయంలో ఈమూవీ ‘బాహుబలి 2’ మించి పోతుంది అని అంటున్నారు.  వచ్చే ఏడాది జనవరి 25న రజనీ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆరోజు గురువారం అయింది. ఇక జనవరి 26న రిపబ్లిక్ డే హాలిడే. ఆ తర్వాత వీకెండ్ కావడంతో ఒక్క రజినీకాంత్ ‘రోబో 2.0’ తప్ప మరే సినిమా ఇప్పట్లో ‘బాహుబలి 2’ దరిదాపులోకి కూడ రాలేదు అన్నది వాస్తవం.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: