స్టార్ హీరో హీరోయిన్లకు షాక్ ఇస్తుంది..!

frame స్టార్ హీరో హీరోయిన్లకు షాక్ ఇస్తుంది..!

Edari Rama Krishna
మనకు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై వాటి వెనుక ఉన్న నిజాలు బయట పెడుతూ..వారి బాగోతాలు బట్టబయలు చేసిన ‘వికిలీక్స్ ’ గురించి తెలియని వారు ఉండారు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరో, హీరోయిన్ల బాగోతాలు బయటపెడుతూ  ‘సుచిలీక్స్’ వస్తుంది..అదేనండీ కోలీవుడ్ లో స్టార్ సింగర్ కమ్ పాపులర్ యాంకర్ సుచిత్ర కార్తీక్ ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ లో కొంత మంది బాగోతాలు ట్విట్టర్ లో లీక్ చేస్తూ హల్ చల్ సృష్టిస్తుంది.  

ఇప్పటికే స్టార్ హీరో ధనుష్ పై సెన్సేషనల్ ఆరోపణలు చేసి, ఇంకో స్టార్ హీరో శింబుపై కామెంట్స్ చేసి.. అలాగే ఆశ్రమంలో సెక్స్ స్కాండల్ అంటూ ట్విట్టర్ లో రచ్చరచ్చ చేసిన సుచిత్ర.. తాజాగా పలువురు కోలీవుడ్ స్టార్స్ యొక్క పర్సనల్ విషయాలను బయటకు తీస్తూ కలకలం రేపింది. ఈ అమ్మడు  ధనుష్ – త్రిష, అనిరుద్ – ఆండ్రియా, హన్సిక, యాంకర్ దివ్యదర్శిని లాంటి స్టార్ హీరో హీరోయిన్ల పర్సనల్ ఫోటోలను బయట పెట్టింది.  దీంతో ఇప్పుడు కోలీవుడ్ లో  హీరోయిన్ ఆండ్రియా సంగీత దర్శకులు అనిరుధ్ ల మధ్య ఏదో ఉందని గతంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  

పైగా ఆండ్రియా అనిరుధ్ ల లిప్ లాక్ ఫోటో మరింత సంచలనం సృష్టించింది . అయితే అప్పట్లో కొద్దిరోజులు హల్చల్ చేసిన ఆ సంఘటన ని అంతా మర్చిపోయారు కట్ చేస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత తాజాగా సింగర్ సుచిత్ర కొన్ని ఫోటోలు లీక్ చేసి పెద్ద దుమారమే రేపింది. అయితే  ఇదంతా సుచిత్రే చేస్తుందా లేక ఇంకెవరి పనై ఉంటుందా అని నెటిజన్లు చర్చిస్తున్నారు.

ఇదే సమయంలో పరిశ్రమ పెద్దలు మాత్రం.. సుచిత్ర వ్యక్తిగత జీవితం సమస్యల్లో పడిందని, దాంతో ఆమె కొందరు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తుందని, అందులో ముఖ్యంగా తనతో సన్నిహితంగా మెలిగిన ఫ్రెండ్స్ ను టార్గెట్ చేసిందని అంటున్నారు.  ఏది ఏమైనా సుచిత్ర లీక్ చేసిన ఫోటోల లో అనిరుధ్ తో కలిసి ఆండ్రియా మంచి మూడ్ లో ఉన్న స్టిల్స్ పిచ్చి లేపుతున్నాయి .  ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: