ఘాజీ పై రాజమౌళి మౌనం !

Seetha Sailaja
విడుదలైన ప్రతి చిన్న సినిమా పైనా ఆ సినిమా ఏమాత్రం బాగున్నా వెంటనే స్పందించే రాజమౌళి ఇప్పటి వరకు రానా ‘ఘాజీ’ పై స్పందించక పోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది.  కొన్ని సినిమాలకు రాజమౌళి తన ట్విటర్ కామెంట్స్ ద్వారా బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆ మూవీల ప్రమోషన్ కు తన కామెంట్స్ తో పబ్లిసిటీ చేసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.

అయితే నిన్న విడుదలైన ‘ఘాజీ’ పై రాజమౌళి వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు. ఈ మూవీకి మీడియా వర్గాలలో అనూహ్య స్పందన వస్తోంది.  విమర్శకులు ఈ మూవీకి మంచి రేటింగ్స్ ఇస్తున్నారు.  ఈ మూవీ పై మౌత్ టాక్ కూడా చాల బాగుంది.  

తెలుగు సినిమా రంగం గర్వపడే సినిమాగా ‘ఘాజీ’ మారింది అంటూ రానా పై దర్శకుడు సంకల్ప రెడ్డి పై ప్రసంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీకి కలక్షన్స్ కూడ రానా సినిమాలకు సంబంధిచి మించిన స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే రాజమౌళి ఇలా స్పందించకుండా మౌనంలో ఉండటానికి ఈసినిమాను బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన కరణ్ జోహార్ కారకుడా ? అన్న మాటలు వినిపిస్తున్నాయి.  ‘బాహుబలి 2’ బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో కరణ్ జోహార్ కు రాజమౌళికి ఏర్పడ్డ గ్యాప్ ఈ మౌనానికి కారణమా ? అని మరికొందరి సందేహం.  

మరో వాదన ప్రకారం రానా ఈమధ్య తేజా దర్శకత్వంలో నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో రానా నటించడం రాజమౌళికి ఇష్టం లేదు అన్న వార్తలు ఉన్నాయి. దీనికి కారణం పై స్పష్టమైన క్లారిటీ లేకపోయినా ఈమధ్య కాలంలో రానా రాజమౌళిల మధ్య కనిపించని దూరం ఏర్పడింది అన్న గాసిప్పులు కూడా వినిపించాయి. అయితే ఎన్నో ఊహలకు గాసిప్పులకు తావిస్తున్న రాజమౌళి తన మౌనాన్ని ‘ఘాజీ’ విషయంలో త్వరగా వీడి ఈ సస్పెన్స్ కు తెర దించుతాడు అని చాలామంది భావిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: