మళ్లీ మొదలు పెట్టిన నిఖిత

Prasad
తెలుగులో కొన్ని సినిమాలలో నటించినా ఇక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది కన్నడ సుందరి నిఖిత. ఈ భామ ఇప్పుడు కన్నడంలో బిజీగా ఉంది. అలాగే హీరో దర్శన్ తో నిఖిత ఎఫైర్, దీంతో కన్నడ సినిమ పరిశ్రమ నిఖితను బ్యాన్ చేయడం, మళ్శీ ఆ నిషేధం ఎత్తివేయడం.. వంటి విషయాలు అందరికీ తెలిసిందే. కాగా, చాలా రోజుల తరువాత నిఖిత మళ్ళీ దర్శన్ తో కలిసి నటిస్తుంది. ’స్నేహితురు‘ అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా నిఖిత నటిస్తుంది. ఇందులో ఒక ముఖ్యపాత్రకు దర్శన్ ను ఎంపిక చేశారు. అసలు ఈ పాత్రకు దర్శన్ పేరును నిఖితే సిఫార్సు చేసిందని, తన స్థాయికి తక్కువే అయినా నిఖిత కోసమే ఈ పాత్ర చేయడానికి దర్శన్ అంగీకరించాడని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: