బాలీవుడ్ లో బాలు సంచలనం
మన తెలుగు వారు గర్వింప తగ్గ గాయకుడు బాలసుబ్రమణ్యం పాటలు మన తెలుగు నిర్మాతలకు నచ్చక పోయినా బాలీవుడ్ సూపర్ స్టార్స్ కు నచ్చు తున్నాయి. ఇక వివరాల లోకి వెళ్ళితే బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కు మన గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం అందిస్తున్నారు. బాలీవుడ్ బాద్‌షా చిత్రాలకు బాలు ఇంతకుముందెన్నడూ గాత్ర దానం చేసిన దాఖలాలు లేవు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో షారూఖ్, దీపికా పదుకొణెలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను ప్రస్తుతం బాలు ఆలపించడం విశేషం.
షారూఖ్ భార్య గౌరి ఖాన్ నిర్మిస్తున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రానికి విశాల్-శేఖర్లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్ధాల తరువాత షారూక్‌ఖాన్ చిత్రంలో పాట పాడమని సంగీత దర్శకులు కోరితే బాలు చాలా ఆశ్చర్యపోయారట. అమితాభ్ భట్టాచార్య రాసిన ఈ పాట ఎంతో నచ్చడంతో పాడటానికి పచ్చజెండా వూపారట బాలు. ఈ పాటను కేవలం రెండు గంటల వ్యవధిలోనే రికార్డింగు పూర్తి చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడిదే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక గతంలో అందరినీ అలరించిన సల్మాన్ ఖాన్ 'మైనే ప్యార్ కియా'లో పాటలు పాడారు. వినసొంపుగా ఉన్న దీనిలోని పాటలు ప్రపంచం మొత్తం మారుమోగిపోయాయి. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో ప్రసిద్ధ గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు కూడా ప్రముఖ పాత్ర పోషించాయి.
మైనే ప్యార్ కియా చిత్రం తరువాత సల్మాన్ ఖాన్ నటించిన మరికొన్ని చిత్రాలకు పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం. సల్మాన్ సినిమాలకు ప్రస్తుతం దక్షిణాది లో అంత గా మార్కెట్ ఉండటం లేదు ఈ సినిమా పేరు చెన్నై ఎక్స్ ప్రెస్ కాబట్టి దక్షినాది ప్రేక్ష కులను ఆ కర్శిం చడానికి సల్మాన్ ఈ ప్రయోగం చేసి ఉంటాడని టాక్ వినిపిస్తోంది ...