అల్లు శిరీష్ అంటున్నది నిజమేనా !!
అల్లువారి అబ్బాయి శిరీష్ మరో సంచలన వార్త కు తెరతీసాడు. ట్విటర్ ను తమ కుటుంబ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న వారిలో అల్లు శిరీష్ కూడా ఒకరు. గతంలో అవతలి వారు సాధించిన రికార్డులు ఫేక్ అని, తమ వారి సినిమాలు సాధించిన వసూళ్లు నిజమని అనేక సార్లు తన ట్వీట్ల ద్వారా విమర్శించిన శిరీష్ ఇప్పుడు కొత్త మరో కొత్త విషయాన్ని ప్రచారంలోకి తీసుకు వస్తున్నాడు తన సోదరుడు అల్లు అర్జున్ నటించిన సినిమా తొలి రోజే 12 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని శిరీష్ అంటున్నాడు.
శిరీష్ అన్నది నిజామా అని అనుకుందాము అంటే తొలి షో తర్వాతే ఈ సినిమాకు మిశ్రమి రివ్యూలు వచ్చాయి. సినిమా ఓ రేంజ్ లో ఉంది అని చెప్పగలిగే వారు కనపడలేదు! మరి అలాంటప్పుడు ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పరిగణనలోకి తీసుకుని చూస్తే మరీ తొలిరోజే 12 కోట్ల రూపాయల వసూళ్లు అంటే కాస్తంత కష్టమేనని అనుకోవాలేమో! దీని సంగతి ఇలా ఉంటే.. ఒకవైపు ఈ సినిమాకు క్రిటిక్స్ అంత మంచి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. దీన్ని బిలో యావరేజ్, యావరేజ్ సినిమాగానే వారు గుర్తిస్తున్నారు.
ఇటువంటి నేపథ్యంలో.. అల్లు శిరీష్ తమ సినిమాను కాపాడుకోవడానికి ట్విటర్ ద్వారా ఇలాంటి వాదన మొదలుపెట్టారని అనుకోవాల్సి వస్తోంది! ఈ సినిమాను బన్నీ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా శిరీష్ గుర్తించారు. మరి ఇందులో నిజానిజాలు ఎన్ని ఉన్నా… తమ సినిమాకు వచ్చిన నెగిటివ్ ఇమేజీని కాపాడుకోవడానికే శిరీష్ ప్రయత్నిస్తున్నాడని అనుకోవాలేమో! శిరీష్ తన ట్విటర్ ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సినిమా కలెక్షన్స్ అసలు రంగు ఈ వారం నుంచి తేలనున్నది.....