దున్నపోతులతో అల్లు అర్జున్

Prasad
అల్లు అర్జున్ హీరోగా ‘ఇద్దరమ్మాయిలతో..’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతుంది. ‘బుల్ రేస్’లకు స్పెయిన్ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఈ ‘బుల్ రేస్’ లను చూడ్డానికే అనేక మంది పర్యాటకులు స్పెయిన్ చేరుకుంటారు. దున్నపోతులను కట్టడి చేయడంలో బుల్ ఫైటర్లు చూపించే తెగువ అందర్నీ ఆకట్టుకుంటుంది. కాగా, ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాలో ఈ బుల్ రేస్ దృశ్యాలను జోడించనున్నారు. దీని కోసం దున్నపోతులతో అల్లు అర్జున్ పాల్గొనే సన్నివేశాలను తాజాగా చిత్రీకరిస్తున్నారు. ఈ బుల్ రేస్ ల నేపధ్యంలో కొన్ని బాలీవుడ్ చిత్రాలను రూపొందించారు. అయితే బుల్ రేస్ దృశ్యాలతో వస్తున్న తొలి తెలుగు చిత్రంగా ‘ఇద్దరమ్మాయిలతో..’ గుర్తింపు తెచ్చుకోనుంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమలాపౌల్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: