పవన్ శివాజీల మీటింగ్ వెనుక ఆంతర్యం?

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ సామాన్యంగా ఎవర్నీ వ్యక్తిగతంగా కలవడానికి పెద్దగా ఆసక్తి కనపరచడు.  అందువల్లనే పవన్ ఎత్తుగడకు సంబంధించిన విషయాలు ఎక్కడా లీక్ అవ్వవు.  అయితే అనూహ్యంగా లేటెస్ట్ గా ఏపీ ప్రత్యేక హోదా సాధన కమిటీ గౌరవ అధ్యక్షుడు టాలీవుడ్ నటుడు శివాజీకి పవన్ కళ్యాణ్ కాంపౌండ్ నుంచి పిలుపు అందడంతో శివాజీ పవన్ ఇంటికి వెళ్ళి చాల రహస్యంగా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ న్యూస్ ఫిలింనగర్ లో హాట్ న్యూస్ గా మారింది.  గత కొంత కాలంగా నటుడు శివాజీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ విపరీతంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. 

ఈమధ్యనే లేటెస్ట్ గా టీడీపీ రాజ్యసభ ఎంపీ మంత్రి సుజనా చౌదరి పై శివాజీ చేసిన కామెంట్స్ కు శివాజీ పై తెలుగు దేశానికి చెందిన కొందరు ప్రముఖ నాయకులు రివర్స్ దాడి మొదలు పెట్టారు.  ఇలాంటి పరిస్థుతులలో కార్నర్ అవుతున్న శివాజీని పవన్ తన వద్దకు పిలిపించుకుని ఇక ఆంధ్రప్రదేశ్ సమస్యల పై తాను ఇక చూస్తూచూస్తూ కూర్చునే పరిస్థితిలో లేనని చెప్పడమే కాకుండా ఈ నెల 9న కాకినాడలో పెట్టబోయే భారీ బహిరంగ సభ గురించి పవన్ శివాజీకి వివరించినట్లు టాక్. 

ఈమధ్య కాలంలో పవన్ తిరిగి రాజకీయ సమావేశాల విషయంలో బాగా యాక్టివ్ అవుతున్న నేపధ్యంలో పవన్ పై విమర్శలు చేసే వారి సంఖ్య బాగా పెరిగి పోతూ ఉండటంతో కొంత వరకు అటువంటి విమర్శలకు శివాజీ చేత కౌంటర్లు వేయించాలని వ్యూహాత్మకంగా పవన్ శివాజీని తన కాంపౌండ్ కు పిలిపించుకున్నాడా అనే గాసిప్పులు కూడ వినిపిస్తున్నాయి.  ఈమధ్య శివాజీ ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ  పవన్ జనం మధ్యకు వచ్చి ఉద్యమిస్తే ఏపీకి ప్రత్యేక హోదా 3 నెలలో వస్తుందని శివాజీ పలుమార్లు చెప్పిన నేపధ్యంలో ఆ కామెంట్స్ పవన్ వరకు వెళ్ళడంతో పవన్ స్వయంగా శివాజీని పిలిపించి ఉంటాడు అన్న ఊహాగానాలు కూడ హడావిడి చేస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈ సాయంత్రానికి కానీ లేదంటే రేపు మధ్యాహన్నం లోపు కానీ కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ని ప్రకటించడం ఖాయం అని అంటున్నారు.  అయితే ఎల్లుండి పవన్ బహిరంగ సమావేశం జరగబోతున్న నేపధ్యంలో ఈ లోపునే ఎదో ఒకటి చేసి పవన్ స్పీడ్ కు కళ్ళెం వేయాలని కేంద్రప్రభుత్వం చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి.

దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దృష్టి అంతా మరొక 48 గంటలలో జరగబోతున్న పవన్ కాకినాడ బహిరంగ సమావేశం పైనే ఉంది.  ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో పవన్ రహస్యంగా శివాజీ తో ఏమి మాట్లాడాడు అన్న విషయం పై రకరకాల ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: