రాజీవ్ కనకాలపై జూనియర్ సెటైర్ !

Seetha Sailaja
నిన్న వినాయకచవితి రోజున ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన ఒక పండుగ స్పెషల్ కార్యక్రమంలో ‘జనతా గ్యారేజ్’ యూనిట్ అంతా వినాయకచవితి పూజను నిర్వహించి ఆ తరువాత ‘జనతా గ్యారేజ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ ఇంటర్వ్యూలో జూనియర్ నిత్యామీనన్ కొరటాల శివ రాజీవ్ కనకాల తదితరలు పాల్గొన్నారు.  అయితే ఈ ఇంటర్వ్యూలో జూనియర్ రాజీవ్ కనకాలలు ఒకరినొకరు సరదాగా టార్గెట్ చేసుకుంటూ వేసిన సెటైర్లు ఆ కార్యక్రమానికి హైలెట్ గా మారాయి.

జూనియర్ ఎన్టీఆర్  రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిన విషయం.  జూనియర్ నటించే చాల  సినిమాలలో ఏమాత్రం అవకాశం ఉన్నా రాజీవ్ కనకాల కోసం ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో రాజీవ్ కనకాల పాత్ర చిన్నదే అయినా ఆ పాత్రకు చాల మంచి పేరు వచ్చింది.

నిన్న జరిగిన  ‘జనతా గ్యారేజ్’  ప్రమోషన్ ప్రోగ్రాంలో రాజీవ్ కనకాల సీన్ గురించి జూనియర్ మాట్లాడిన తరువాత రాజీవ్ కనకాల మైక్ అందుకుని జూనియర్ గురించి మాట్లాడుతూ “నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో పరిణతి సాధించాడని, సన్నివేశానికి తగిన భావాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడని, దాంతో ఆ సన్నివేశాలు అద్భుతంగా పండుతున్నాయని, నటుడిగా అంతకంటే సాధించడానికి ఏమీ ఉండదని” అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై రాజీవ్ కనకాల ప్రశంసల వర్షం కురిపించాడు. 

దీనితో జూనియర్ రాజీవ్ వైపు ఆనందంగా చూస్తూ ‘రాజు’ శభాష్ అంటూ కనకాలను సంభోదించాడు. అయితే ఆ పొగడ్త రాజీవ్ కనకాలకు అసలు నచ్చలేదు.  దీనికి కారణం ఎవరైనా ‘రాజు’ అని పిలిస్తే రాజీవ్ కనకాలకు అస్సలు ఇష్టం ఉండదట. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా జూనియర్ రాజీవ్ కనకాలను ‘రాజు’ అని పిలవడమే కాకుండా రాజీవ్ ని మరింత ఏడిపించడానికి తన షేల్ ఫోన్ లో రాజీవ్ కనకాల సెల్ నెంబర్ ను తాను ‘రాజు’ అని ఫీడ్ చేసుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. 

ఈ సెటైర్ కు ఆశ్చర్యపోయిన రాజీవ్ కనకాల తాను తన సెల్ ఫోన్ లో  జూనియర్ ఎన్టీఆర్ మొబైల్ నెంబర్ ను ‘కిడ్’ అని ఫీడ్ చేసుకున్నాను అని చెప్పడంతో ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న నిత్యామీనన్ కొరటాల శివలు కూడ తెగ నవ్వుకున్నారు.  దీనితో పండుగ రోజున ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రేక్షకులు కూడ బాగా ఎంజాయ్ చేసారు. 

అయితే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న నిత్యామీనన్ అచ్చమైన తెలుగు అమ్మాయిలా పట్టుచీర కట్టుకుని సాంప్రదాయ బద్ధమైన నగలు పెట్టుకుని నుడుటున కుంకుమ బొట్టు పెట్టుకుని  ర్ర్ కార్యక్రమంలో చాల భక్తిగా వినాయక పూజ చేసింది నిత్యామీనన్. అయితే స్వతహాగా దేవుడును నమ్మని నస్తికురాలైన నిత్యామీనన్ ‘జనతా గ్యారేజ్’ కోసం వినాయక చవితి పూజ చేయడం చూసిన వారు మాత్రం నిత్యామీనన్ సినిమాలలోనే కాదు ఛానల్స్ కార్యక్రమాలలో కూడ బాగా నటిస్తోంది అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: