‘గ్రీకు వీరుడు’కు భలే రెస్పాన్స్..!

Prasad
అక్కినేని నాగార్జున కొత్త సినిమా టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దశరథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘గ్రీకు వీరుడు’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ టైటిల్ కు అభిమానులు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. గతంలో ఇదే సినిమాకు ‘లవ్ స్టోరీ’, ‘సరిలేరు నీకెవ్వరు’ అనే పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ఈ టైటిల్స్ కు రాని రెస్పాన్స్ ‘గ్రీకు వీరుడు’కు వస్తుంది. అభిమానులు, సినీ వర్గాలు నుంచి ఈ టైటిల్ కు మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే, నాగార్జున హిట్ సినిమాల్లో ఒకటైన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలోని ‘గ్రీకు వీరుడు..’ అనే పాట సూపర్ హిట్టయింది. దీంతో ఇప్పుడు ‘గ్రీకు వీరుడు’ టైటిల్ ను ఖరారు చేయాలని చిత్రయూనిట్ భావిస్తుంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, ఈ చిత్రాన్ని కామాక్షి మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: