తాను బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ ని కాదు అని అంటున్న సమంత !

Seetha Sailaja
నిన్న ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యూట్ హీరోయిన్ సమంత తన పై తానే ఒక ఆసక్తికర సెటైర్ వేసుకుంది. తన కెరియర్ ఇంత విజయవంతంగా వేగంగా దూసుకు పోవడానికి కారణం తన తల్లితండ్రులు అని చెపుతూ అయితే ‘తాను ఒక మంచి కూతురుని కాదు, మంచి స్నేహితురాలుని కాదు అన్నింటా మించి తాను మంచి గర్ల్ ఫ్రెండ్ ని కాదు’ అని సంచలన కామెంట్స్ చేసింది. 

సమంత నోటి వెంట మంచి గర్ల్ ఫ్రెండ్ ని కాదు అనే మాటలు రావడం వెనుక అర్ధాలు ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. గతంలో సిద్దార్థ్ తో పీకలలోతు ప్రేమలో పడ్డ సమంత ఆ తరువాత అతడితో బ్రేకప్ అయిపోయిన నేపధ్యంలో ఇప్పుడు ఆ విషయాలు గుర్తుకు వచ్చి ఇటువంటి కామెంట్స్ చేసిందా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈమధ్య సమంత ఒక యంగ్ హీరోతో మళ్ళీ ప్రేమ వ్యబహరాలు నడుపుతోంది అనే గాసిప్పులు వచ్చిన నేపధ్యంలో ఆ ప్రేమ వ్యవహారం కూడ బెడిసి కొట్టడంతో సమంత ఇటువంటి షాకింగ్ కామెంట్స్ చేసిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సమంత వరస పెట్టి కోలీవుడ్ టాలీవుడ్ లలో టాప్ హీరోలతో ఆమె భారీ సినిమాల్లో నటిస్తున్నా ఆమె పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ తో విసికిపోయిన సమంత ఇలా కామెంట్ చేసిందా అనే విశ్లేషణలు కూడ ఉన్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా సమంత మోహంలో గ్లో తగ్గింది అంటూ ఈ మధ్య కోలీవుడ్ మీడియా ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్స్ వ్రాస్తోంది. గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘24’ సినిమాలో నటన పరంగా ఆమెకు మంచి మార్కులు పడినా గ్లామర్ విషయంలో సమంత లుక్స్ కు ఏమైంది అంటూ కోలీవుడ్ మీడియా కామెంట్స్ వ్రాస్తోంది. గండు చీమ కుట్టినట్లు పెదాలు వాచిపోయి  చెంపలు బాగా ఉబ్బిపోయి సమంత గ్లామర్ లో ఎదో తేడా వచ్చింది అని మీడియా వార్తలు వ్రాస్తున్న నేపధ్యంలో ‘24’ మూవీ సూపర్ హిట్ అయి కూడ సమంత ఆనoదంగా లేదు అని టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: