షాకింగ్ 95కోట్ల లాస్ లో సర్దార్ చిక్కుల్లో మెగా ఫ్యామిలీ ?

Seetha Sailaja
‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల అయి 10 రోజులు దాటిపోయినా ఈ సినిమా ఏ మేరకు ఎంత నష్టాన్ని తీసుకు వచ్చింది అన్న విషయమై ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేదు అని అంటున్నారు. రోజురోజుకు పడిపోతున్న ఈ సినిమా డ్రాప్ కలక్షన్స్ ప్రభావంతో ఈసినిమాకు ఏకంగా సుమారు 95 కోట్ల నష్టం వచ్చింది అంటూ కొన్ని వర్గాలు ఫిలింనగర్ లో చేస్తున్న ప్రచారం మరింత షాక్ ను ఇస్తోంది.

ఇప్పటికీ ‘సర్దార్’ అమెరికాలో 55 స్క్రీన్స్ లో ప్రదర్శింప బడుతూ ఉన్నా ఈసినిమాకు అమెరికాలో రెండోవ వారానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన కలక్షన్స్ కేవలం 20,807 డాలర్స్ మాత్రమే అని వార్తలు రావడం అందర్నీ షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో ఏ తెలుగు టాప్ హీరో సినిమాకు రాని  స్థాయిలో అత్యంత తక్కువ స్థాయి కలక్షన్స్ ఈ సినిమాకు రావడంతో ఒక్క అమెరికా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కే దాదాపు 4.5 కోట్ల నష్టం వచ్చింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
 

ఈ వార్తలు ఇలా ఉండగా గడిచిన కొద్ది నెలలుగా మెగా కుటుంబ సినిమాలు అన్నీ ఘోరపరాజయం చెందడంతో రామ్ చరణ్ ‘బ్ర్రూస్ లీ’ నుండి పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వరకు ఈ మెగా హీరోల సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు అందరూ నిండా మునిగి పోవడంతో మెగా కుటుంబ హీరోల సినిమాల పేర్లు చెపితే బెదిరిపోతున్నారని టాక్. దీనికి తోడు గత రెండు రోజులుగా టాలీవుడ్ కి హాట్ టాపిక్ గా మారిన ‘లోఫర్’ సినిమా బయ్యర్ల వ్యవహారం కూడ ఒక మెగా యంగ్ హీరో సినిమా గురించే కావడంతో మెగా కుటుంబం సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థుతుల ప్రభావం చిరంజీవి నటించబోయే 150వ సినిమా పై అప్పుడే ప్రభావం చూపించింది అనుకోవాలి. 

అందువల్లనే చిరంజీవి తన ‘కత్తి’ రీమేక్ వ్యవహరాన్ని ఆపుచేసి దర్శకుడు వినాయక్ చెప్పన మరో లేటెస్ట్ కథ గురించి ఆలోచిస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా చూసుకున్నా ఎప్పుడూ లేని తీవ్ర గందర గోళంలో మెగా కుటుంబ హీరోలు ఉన్నారని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: