దర్శకుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు !

Seetha Sailaja
వరస పరాజయాలతో సతమతమైపోతున్న మంచు విష్ణుకు కాస్త ఊరట లభించింది. నిన్న విడుదలైన ‘ఈడోరకం ఆడోరకం’ మూవీ మొదటి రోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో విష్ణు కెరియర్ కు మళ్ళీ బ్రేక్ వచ్చింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనికితోడు విష్ణు కూడ తన వేగాన్ని పెంచి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మంచు వారి అబ్బాయి నేటి దర్శకుల పై కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. ‘ఊపిరి’ ‘క్షణం’ లాంటి కొత్త కాన్సెప్టు సినిమాలలో నటించ వచ్చు కదా అని మీడియా ప్రశ్నించినప్పుడు మంచి కథలను సినిమాలుగా తీసే దర్శకులు ఎక్కడ ఉన్నారు అంటూ ఏకంగా దర్శకుల పైనే ఎదురు దాడి చేసాడు విష్ణు.

అంతేకాదు ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ ‘అసెంబ్లీ రౌడీ’ లాంటి కథలను డైరెక్టర్లను తెమ్మనండి. నేను నటించడానికి రెడీ అంటూ డైరెక్టర్స్ కు సవాల్ విసిరాడు విష్ణు. అదేవిధంగా తన కేరక్టర్ ఎంత లెంగ్త్ ఉంటుందనే విషయాన్ని పట్టింకుండా ఐదు నిమిషాల పాత్రలో అయినా తాను రెడీ అంటూ నేటి తరం దర్శకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు ఈ మంచువారి అబ్బాయి.

ఇదే సందర్బంలో మరో సంచలన విషయం పై లీకులు కూడ ఇస్తున్నాడు. తాను తనికెళ్ల భరణి దర్శకత్వంలో ‘కన్నప్ప’ సినిమాను చేయడం ఖాయం అని అంటూ తన తర్వాతి సినిమా ఇదే అని కూడా వెల్లడించాడు విష్ణు. తనికెళ్ల భరణి అద్భుతమైన స్క్రిప్టు తయారు చేశాడని.. తన మార్కెట్ కు మూడు రెట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా చేయబోతున్నామని విష్ణు చెప్పడం విశేషం. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్ల సాయం తీసుకోబోతున్నట్లు కూడా విష్ణు వెల్లడించాడు. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఈ చిత్రం తయారు కాబోతోందని చెప్పడమే కాకుండా ఈ సినిమాలో తన తండ్రి మోహన్ బాబు ఒక ప్రముఖ పాత్రను పోషిస్తాడు అన్న విషయాన్ని కూడ బయట పెట్టాడు విష్ణు. రాకరాక వచ్చిన ఒక్క సినిమా హిట్ విష్ణులో మరింత దూకుడు పెంచింది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: