పవన్ కు ఫ్యాన్స్ రిప్రజంటేషన్లు !

Seetha Sailaja
‘గబ్బర్‌సింగ్‌’, ‘అత్తారింటికి’ దారేది సినిమాలతో బ్యాడ్‌ డేస్‌ అయిపోయాయని ఆనంద పడ్డ పవన్ ఫాన్స్ ఆనందాన్ని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నాశనం చేయడమే కాకుండా పవన్ అభిమానులకు 'జానీ' రోజులు గుర్తుకు వచ్చేలా చేసింది. దీనికి తోడు పవన్‌ మరో రెండు, మూడు సినిమాలు తప్ప చేయనని అంటున్న టైమ్‌ లో ఇలాంటి ఫ్లాప్‌ రావడం పవన్ అభిమానులకు  జీర్ణించు కోలేని నిజంగా మారింది.

 ఈ పరిస్తితుతులు ఇలా ఉండగా పవన్ ఈ నెల 29 నుంచి ఎస్.జె. సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభించబోతున్నట్లు  వార్తలు రావడంతో ఈ ప్రయత్నం నుంచి చివరి నిముషంలో అయినా పవన్ ను తప్పించాలని మన ఇరు రాష్ట్రాలలోని పవన్ వీరాభిమానులు ఖంగారు పడుతూ పవన్ కు ఈ విషయమై ఓ రిప్రజంటేషన్ ఇచ్చారని సమాచారం. ఎస్.జె. సూర్యతో పనిచేయటం కన్నా త్రివిక్రమ్ చేస్తే మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ వస్తుందని, డెషిషన్ మరోసారి ఆలోచించి తీసుకోమని ఆ రిప్రజెంటేషన్ లో పవన్ అభిమానులు కోరినట్లు టాక్.

అంతేకాదు త్రివిక్రమ్ పవన్ ల మూవీ  ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలని కొందరు అభిమానులు ఏకంగా ఆలయాలలో పూజలు కూడ చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక  ఫేస్‌ బుక్‌ ట్విట్టర్‌ లో కొందరు అభిమానులైతే ఏదో ఒకటి జరిగి ఎస్‌.జె. సూర్యతో పవన్ చేసే సినిమా ఆగిపోవాలని కోరుకుంటూ మెసేజ్  లు పెడుతున్నారు.

అయితే సామాన్యంగా అభిమానుల కోరికలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చే పవన్ తనకు తన అభిమానులు అందిస్తున్న విన్నపాల పై ఎలా స్పందిస్తాడో చూడాలి. ‘సర్దార్’ విడుదల అయి వారం రోజులు కూడ కాకుండానే పెను సంచలనాలను సృష్టిస్తోంది అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: