డాన్ స్ధానంలో భాయ్

Durga
సల్మాన్ ఖాన్ అభిమానులకు ఒక శుభవార్త. దబాంగ్ నుంచి వరస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్ మరో ఘనతను సొంతం చేసుకోనున్నాడు. ప్రసిద్ధి చెందిన మాడమ్ తుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియం, న్యూయార్క్ శాఖలో ’భాయ్‘ మైనపు బొమ్మను ప్రతిష్టించనున్నారు. ఆగస్టులో సల్మాన్ మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఇక్కడ విశేషమేమిటంటే ఇప్పటికే మ్యూజియంలో ఉన్న మరో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మైనపు బొమ్మను తీసీ వేసి సల్మాన్ బొమ్మను ఏర్పాటు చేస్తారట. ఇప్పటికే వరుస హిట్లతో షారుఖ్ ఖాన్ గుండెల్లో గుబులుపుట్టిస్తున్న సల్మాన్ ఈవిధంగానూ షారుఖ్ ను దెబ్బకొట్టనున్నాడన్న మాట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: