ఈమధ్య కాలంలో తన మాటలలోని ద్వందార్ధాల డోస్ ను తగ్గించిన అలీని చూసి అలీ మారిపోయాడు అని అనుకున్నారు అంతా. అయితే అలీ నిన్న జరిగిన ‘ఊపిరి’ ఆడియో వేడుకలో తిరిగి తన సహజ మాటల ధోరణిని మరిచిపోలేదు అనే సంకేతాలు ఇచ్చాడు. నిన్న జరిగిన ఆడియో వేడుకలో హీరోయిన్ కాజల్ మాట్లాడిన తరువాత మాట్లాడడానికి వేదిక పైకి వచ్చిన అలీ తనదైన శైలిలో కాజల్ పై సెటైర్లు వేసాడు.
‘కాజల్ అంతకు ముందు నాగార్జునగారిని చాలసార్లు కలిసింది. ఎప్పుడూ ఇంతగా పొగడలేదు అయితే ఆమెకు ఇప్పుడే తెలిసింది. మీకు కొత్తగా 50 కోట్లు వచ్చాయని అయితే ఎంత పొగిడినా ఒక్క రూపాయి కూడా కాజల్ కు ఇవ్వొద్దు కావాలంటే అమలకు ఇవ్వండి’ అంటూ అలీ చేసిన వ్యాఖ్యలకు కాజల్ షాక్ అయిoది.
అయితే ఆ ఆడియో వేడుక జరుగుతున్న వేదిక అంతా నవ్వులతో నిండిపోయింది. ఇదే సందర్భంలో అలీ మరో అడుగు ముందుకు వేసి నాగార్జునకు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదని ఇలాంటి పాత్రలో నటించాలంటే ఎంతో ధైర్యం కావాలని అంటూ ఈ సినిమా నాగ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని కామెంట్ చేసాడు.
ఆతరువాత వెంటనే అలీ మాట్లాడుతూ నాగార్జున చేయి పడితే ఆడ అయినా మగ అయినా పై పైకి వెళ్ళడమే అంటూ అలీ పలికించిన హావభావాలు చూసినవారు అలీ ఇంకా మారలేదు అని కామెంట్ చేసుకున్నారని టాక్. నిన్న విడుదలైన ఈ సినిమా పాటలు చాలా డిఫరెంట్ గా అనిపించినా ఈసినిమా ఎక్లాసు సెంటర్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయిపోతుందా అన్న కామెంట్స్ వినిపించాయి..