ఊపిరి సినిమా తమిళ్ లో తోడాగా రిలీజ్ అవుతుంది. కింగ్ నాగర్జున, కార్తిలు కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా చేస్తుంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో పివిపి నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ ఆడియో నిన్న రిలీజ్ అయ్యింది. అయితే సినిమా ఆడియో వేడుకలో నాగార్జున సూర్యను పొగడ్తలతో ముచెత్తాడు. కార్తి గురించి తన యంగర్ సోదరుడు అన్న నాగ్ సూర్యను ఆకాశానికెత్తేశాడు.
సూర్యకు తాను ఓ మంచి అభిమానినని.. తన గజిని సినిమా చాలా బాగా నటించాడని.. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూర్యకు మంచి అభిమానులు ఉన్నారని అన్నారు. కేవలం తమిళ్ లోనే కాదు సూర్య సౌత్ లోనే బిగ్ బిగ్ స్టార్ అనేశాడు. అయితే తెలుగు స్టార్లకు సరిసమానమైన ఇమేజ్ ఉన్న సూర్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే తెలుగు హీరోలు తమ సినిమాలను కూడా పోస్ట్ పోన్ చేస్తారన్నారు.
అయితే ఈరేంజ్లో సూర్యను పొగడటానికి కారణం నాగ్ తన తనయుడు అఖిల్ సినిమాలకు ఫ్యూచర్లో సహాయపడే ఆలోచనతోనే నాగ్ సూర్యను పొగిడి ఉంటాడని అనుకుంటున్నారు. ఇక సినిమా వాళ్ల ఫంక్షన్స్ లో ఒకరి గురించి ఒకరు పొగడటం మాములే. హాలీవుడ్ ఇన్ టచబుల్స్ సినిమాకు అఫిషియల్ రీమేక్ గా వస్తున్న తోడా తెలుగులో ఊపిరిగా రిలీజ్ అవుతుంది.
సినిమా మార్చ్ 25న రిలీజ్ అవుతుండగా మార్చ్ 1న ఆడియో రిలీజ్ కాబోతుంది. తెలుగులో కూడా ఊపిరి సినిమాను భారీ రేంజ్లో రిలీజ్ చేయనున్నారు. మరి నాగ్ సూర్యను పొగడటం చూస్తుంటే ఇప్పుడు నాగార్జున తమిళ పరిశ్రమ మీద కూడా కన్నేశాడు అనే భావన కలుగుతుంది. సినిమా మీద చిత్ర యూనిట్ అంటా మంచి నమ్మకంతో ఉన్నారు.