సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న హాలీవుడ్ అందం

Devi Priya
హాలీవుడ్ హీరోయిన్, ఆస్కార్ అవార్డు గ్రహీత కేట్ విన్స్ లెట్ వివాహం తన బాయ్ ఫ్రెండ్ నెడ్ రాకెన్ రోల్ తో సీక్రెట్ గా జరిగింది. కేట్ విన్స్ లెట్ కు ఇది మూడవ వివాహం. ఇరుపక్షాల వైపు తల్లితండ్రులకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఈ పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ పెళ్లి వేడుకకు ఫ్రెండ్స్, విన్స్ లెట్ పిల్లలు హాజరయ్యారు. గతంలో దర్శకుడు జిమ్ థ్రిప్ ల్టెన్, సామ్ మెండెస్ తో వివాహం జరిగింది. రాకెన్ రోల్ తో విన్స్ లెట్ వివాహాన్ని ఆమె ప్రతినిధి ధృవీకరించారు. గత కొంత కాలం నుంచి డేటింగ్ చేస్తున్న వీరిద్దరికి గత వేసవిలో యంగేజ్ మెంట్ జరిగింది. 37 ఏళ్ల కేట్ 34 ఏళ్ల రాకెన్ రోల్ వివాహమాడడం హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: