ఓ సినిమా నిర్మించిన నిర్మాత ఆ సినిమాను ఆకాశానికెత్తేయడం మాములే.. అయితే సినిమా రిలీజ్ తర్వాత వచ్చే రివ్యూ రేటింగ్ కూడా చెప్పేయడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకీ అలా రేటింగ్ ఇచ్చింది ఎవరో కాదు స్వయాన బడా నిర్మాత దిల్ రాజు గారే.. సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణాష్టమి ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది.
అయితే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దిల్ రాజు ఈ సినిమాకు ఆడియెన్స్ నుండి 3.5 టు 3.75 రేటింగ్ వస్తుందని చెబుతున్నాడు. అయితే సినిమా నిర్మాతగా తన సినిమా మీద తనకు నమ్మకం ఉండొచ్చు గాని ప్రస్తుతం దిల్ రాజు కాస్త అతి చేస్తున్నాడని టాక్ వస్తుంది. సునీల్ సినిమాకు ఆ రేంటింగ్ అసంభవమని.. అసలే మనోడి ట్రాక్ అసలు బాలేదు కనుక సినిమా రిజల్ట్ కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.
కాని దిల్ రాజు మాత్రం సినిమా సూపర్ హిట్ గ్యారెటీ.. సినిమా రేటింగ్ కూడా బాగా వస్తుంది అంటూ కొత్త నిర్మాత మాట్లాడినట్టుగా కామెడీ చేస్తున్నాడు. సినిమా ఎంత సేఫ్ జోన్లో తీసినా సినిమా మార్కెట్ చేయడంలో ఉన్న టెక్నిక్ దిల్ రాజుకి తెలిసినంతలా మరొకరికి తెలియదు. అందుకే సినిమా హిట్ సూపర్ హిట్ అని ముందే చెబుతూ ప్రేక్షకులకు గాలెం వేస్తున్నాడు.
మరి దిల్ రాజు చెప్పినట్టుగానే సినిమా అంతటి ఘనవిజయం దక్కించుకుంటుందా.. సునీల్ కు ఫ్లాప్ కష్టాలు పోయి సూపర్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా అంటే ఇంకెదుకాలస్యం మరో రోజు ఎదురు చూస్తే సరిపోతుంది కదా అనేస్తున్నారు. ఏది ఏమైనా దిల్ రాజు సినిమాకు ముందే భారీ క్రేజ్ తీసుకువచ్చేలా మాట్లాడటం సినిమా రిలీజ్ తర్వాత ఎంతవరకు ఉపయోగపడ్డదో చెప్పగలం.