మీరు నాన్నకు ప్రేమతో సినిమా చూశారా.. అయితే ఈ క్వశ్చన్ మీకే.. బెడ్ మీద చావు బ్రతుకుల్లో ఉన్న సందర్భంల్లో రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు వచ్చి.. జగపతి బాబు ఓ క్వశ్చన్ అడుగుతాడు.. ఓ యుద్ధంలో జరుగుతుంది.. 100 సోల్జర్స్ పాల్గొన్నారు. అందులో మొదటి వాడు రెండో వాడిని చంపి మూడో వాడికి కత్తి ఇస్తాడు.. మూడో వాడు నాలుగో వాడిని చంపి ఐదో వాడికి ఇలా చంపుకుంటూ పోతో చివరకు మిగిలేది ఎన్నో వాడు అని. ఆ ప్రశ్న అడిగేలోపే 73 అని సమాధానం ఇస్తాడు రాజేంద్ర ప్రసాద్.
అయితే సినిమాలో అన్ని లాజిక్కులతో నింపేసిన సుకుమార్ మరోసారి తన లెక్కల ప్రశ్నా పత్రాన్ని సినిమాలో చొప్పించాడు. అసలైతే అది యాప్టిట్యూడ్ కి సంబంధించిన ప్రశ్న. అయితే దాని సమాధానం అంత ఈజీగా చెప్పాలంటే అది సుకుమార్ వల్లే అవుతుందేమో. అయితే సుకుమార్ బ్రెయిన్ కు మాత్రమే ఇలాంటి ఐడియాలు వస్తాయి. తన సినిమాల్లో ఇలా లెక్కల ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తున్నాడు.
ఆన్సర్ 73 ఎలా అన్నది ఇది చూడండి :
అయితే జెబి అడిగిన అంత పెద్ద ప్రశ్నకు జవాబు సింపుల్ గా 73 అని చెప్పడం ఏంటి. అసలు అది ఎలా సాల్వ్ చేయాలి అని కూర్చున్నారు నెటిజెన్లు ఫైనల్ గా దే గాట్ ఎ ఆన్సర్.. సర్కిల్ లో 100 మంది ఒకటో వాడు రెండో వాడిని చంపి మూడో వాడికి ఇస్తాడు.. ఇలా 7 రౌండ్లలో చంపుకుని మిగిలేవాడు 73 వాడు. ఇది చాలా కష్టతరమైన ప్రశ్న.
కాని దీనికి ఆన్సర్ ని మాత్రం చాలా ఈజీగా 7 రౌండ్లలో కనిపెట్టేశారు నెటిజెన్లు. ప్రస్తుతం ఆ ప్రశ్న యొక్క ఆన్సర్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో హల్ చల్ చేస్తుంది. మన రీడర్స్ కోసం కూడా ఆ ఆన్సర్ షీట్ ని మీకందిస్తున్నాము. ఇక దానిలో ఆన్సర్ ఎలా వచ్చింది అన్నది చూస్తే అర్ధమవుతుంది. మొత్తానికి సినిమాతో జ్ఞానం పొందేలా చేస్తున్న సుకుమార్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.