గాళ్ ఫ్రెండ్ ని మార్చేసిన మెగా హీరో..!

shami
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఓ హీరో త్వరగానే మెగా అభిమానులకు నచ్చేశాడు. తన స్టైల్ తో వారిని ఆకట్టుకున్న ఈ హీరో సినిమాను సేఫ్ సైడ్ తీయడంలో కేక అనిపించుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఆ మెగా హీరో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కే కాదు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా రచ్చ రచ్చ చేసేస్తాడని ఓ రూమర్ ఉంది.
అయితే తనతో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఓ భామతో మొన్నటిదాకా ప్రేమకలాపాలను నడిపిన ఈ హిరో ఇప్పుడు మరో భామతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడట.


ఇంతకీ ఎవరా హీరో అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా.. ఆయనే మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ముందు రేయ్ సినిమాలో నటించినా పిల్ల నువ్వులేని జీవితంతో హిట్ కొట్టి రీసెంట్ సుబ్రమణ్యం కూడా బాగా సేల్ అయ్యేలా చూసుకున్న ఈ హీరో గాసిప్పులకు కూడా భలే అవకాశాలను ఇస్తున్నాడు. ఇన్నాళ్లు తనతో రెండు సినిమాలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రెజినాతో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా చేస్తున్న ఈ భామ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుంది అనేలా చేసుకున్నారు.


అంతేనా ఇప్పుడే ఇలాంటివన్ని వద్దు అంటూ మెగా కాపౌండ్ నుండి వార్నింగులు కూడా వచ్చాయ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ మెగా హీరో ఇప్పుడు రెజినాను వదిలి మరో కొత్త పిల్లను పట్టుకున్నాడట. ప్రస్తుతం సుప్రీం సినిమాలో నటిస్తున్న సాయి సినిమాలో తనతో నటిస్తున్న రాశిఖన్నాతో క్లోజ్ గా ఉంటున్నాడట. అంతేకాదు ఇద్దరు క్లోజ్ నెస్ చూస్తుంటే సాయి ఈమెను కూడా తన మాయలో పడేశాడంటున్నారు. 


మొన్నటిదాకా రెజినాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ కుర్ర హీరో ఇప్పుడు తన గాళ్ ఫ్రెండ్ ని మార్చేసి రాశి ఖన్నాతో స్నేహంగా ఉంటున్నాడని తెలుస్తుంది. సుప్రీం సినిమాలో రాశి కాస్త శృతి మించిందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను అనీల్ రావిపూడి డైరెక్ట్ చేయడం విశేషం. రూమర్లు ఎలా ఉన్నా తనపని తాను చేసుకుపోతున్నాడు మెగా హీరో సాయి ధరం తేజ్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: