లావణ్య త్రిపాఠి పై నాని సెటైర్లు !

Seetha Sailaja
వరస పరాజయాలతో సతమతమై పోతున్న నానీకి లావణ్య త్రిపాఠి అదృష్ట లక్ష్మిగా మారి ‘భలే భలే మగాడివోయ్’ సక్సస్ ను అందించిన తరువాత నాని రెట్టించిన ఉత్సాహంతో బాలకృష్ణ వీరాభిమానిగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ట్రైలర్ ను చూసి ఆ ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ ట్విట్ చేయడమే కాకుండా ఈసినిమా యూనిట్ ను అభినందిస్తూ ట్విట్ చేసింది లావణ్య.

ఆ ట్విట్ కు నాని చాల విలక్షణమైన సమాధానం ఇచ్చాడు. ‘హిట్ మిషన్ లా మారిపోయిన నీవు నా సినిమాలలో కూడ గెస్ట్ పాత్రలు వెయ్యలేవా’ అంటూ ఆమె పై తనకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఆమె లక్ తో మరిన్ని విజయాలు అందుకోవచ్చు అనే అభిప్రాయంతో తన మనసులో మాట బయట పెట్టాడు నాని. ఈ యంగ్ హీరో చేసిన ట్విట్  ను బట్టి చూస్తూ ఉంటే లావణ్య టాలీవుడ్ యంగ్ హీరోలకు కూడ గోల్డెన్ లెగ్ సెంటిమెంట్ హీరోయిన్ గా మారిపోయిందా అని అనిపించడం సహజం. 

ఈమె గోల్డెన్ లెగ్ ప్రభావం వల్ల కాబోలు నాగార్జున కెరియర్ లో ఇప్పటి వరకు రాని భారీ కలెక్షన్స్ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కు రావడమే కాకుండా ప్రస్తుతం ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులలో ఏర్పడిన క్రేజ్ తో జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’  అమెరికాలో క్రియేట్ చేసుకున్న రికార్డులను దాటి పోతుంది అన్న వార్తలు వస్తున్నాయి.

లావణ్య త్రిపాఠి నాగార్జున లాంటి సీనియర్ హీరోలకు కూడ జంటగా నప్పడంతో వెంకటేష్ బాలకృష్ణలు లాంటి సీనియర్ హీరోలు ప్రస్తుతం ఎదుర్కుంటున్న హీరోయిన్స్ కొరతకు లావణ్యా త్రిపాఠి ఒక పరిష్కారంగా మారుతుంది అనుకోవాలి. ఏమైనా ఈ హిట్ మిషన్ చేస్తున్న సంచలనాలు టాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: