ఫ్లాష్ : మహేష్ అతడు సినిమా మరో సంచలనం..!!

shami
సూపర్ స్టార్ మరో సంచలనం అది సౌత్ హీరోలకు ఎవరికి కనీసం ఊహించని రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమా కలక్షన్స్ మాత్రమే కాదు సినిమా అన్ని భాగాల్లో అన్ని విధాలుగా ఏదన్న సరికొత్త సంచలనం సృష్టిస్తే అది రికార్డ్ అన్నట్టే.. అయితే ప్రిన్స్ మహేష్, త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్లో 2005లో వచ్చిన సినిమా అతడు.. ప్రొఫెషనల్ కిల్లర్ గా మహేష్ నటన ఆ సినిమాలో సింప్లీ సూపర్బ్.


సినిమా థియేటర్స్ లో డీసెంట్ హిట్ అయినా బుల్లితెరలో మాత్రం ఓ రేంజ్ హిట్ అయ్యింది. మహేష్ బాబు పవర్ఫుల్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం మరో రికార్డుని సొంతం చేసుకుంది. అత్యధిక ప్రాముఖ్యత కలిగిన ఈ సినిమా పోలాండ్ దేశంలో పోలిష్ లాంగ్వేజ్ లో ఈ సినిమాను డబ్ చేయడం జరిగిందట. జయభేరి ఆర్ట్స్ పతాకంలో నిర్మించబడ్డ ఈ సినిమాను మురళి మోహన్ నిర్మించారు. 


అయితే సినిమా పోలాండ్ లో డబ్ అవ్వడానికి కారణం మహేష్ రెగ్యులర్ సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అవుతాయట. అయితే ఆ క్రేజ్ దృష్ట్యా అతడు సినిమాను ఏకంగా పోలాండ్ లాంగ్వేజ్ అయిన పోలిష్ భాషలోకే డబ్ చేసుకున్నారట. ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ సినిమా న్యూస్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. సౌత్ లో ఏ సినిమా కనీసం పోలాండ్ దేశంలో రిలీజ్ అవ్వలేదు.


అలాంటిది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే మహేష్ క్రేజ్ ఖండాతరాలను దాటి వెళ్లిపోయిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాదు మహేష్ బాబు ఏ సినిమా వచ్చినా సరే ఓవర్సీస్లో సినిమా కాసుల వర్షం కురిపించడం ఖాయం. ఓవర్సీస్ లో మహేష్ స్టామినాను బీట్ చేసే హీరో సౌత్ లోనే లేరని చెప్పాలి. మరి అతడు సినిమా పోలాండ్ దేశంలో డబ్ అయిన సంగతి తెలిసిన చిత్ర యూనిట్ ఏమని స్పందించిందో త్వరలో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: