మహేష్ భార్య పై షాకింగ్ సెటైర్లు !

Seetha Sailaja
‘శ్రీమంతుడు’ భార్య నమ్రత పై కాపీ సెటైర్లు పడుతున్నాయి. చెన్నై వరదలు ప్రతి ఒక్కరినీ కదిలించడంతో చెన్నై కష్టాలు చూసి ఎందరో  టాలీవుడ్ సెలెబ్రెటీలు తమవంతు ఆర్ధిక సహాయాన్ని చేస్తున్నారు. ఈ లిస్టులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా చేరి భారీగా కాకపోయినా తన వంతుగా 10 లక్షల ఆర్ధిక సహాయం చేసాడు. ఇప్పటికే ‘సేవ్ చెన్నై’ పేరుతో టాలీవుడ్ యంగ్ హీరోలు ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు, మందులు, దుప్పాట్లు, ఇంటి వస్తువుల రూపంలో సాయం చేస్తూ ఉంటే మహేష్ భార్య నమ్రత మాత్రం కేవలం మెసేజ్ లు పెడుతూ వెబ్ మీడియాలో హడావిడి చేయడం పై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. 

“జీవితం అంటే డబ్బు సంపాదన కాదు. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ బతకడం. మీ దగ్గర ఏటీఎం కార్డ్ ఉంది కానీ ఏటీఎం లేదు. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కానీ ఛార్జింగ్ లేదు. ఇల్లుంది కానీ అందులో జీవించే అవకాశం లేదు కారు బైక్ ఉన్నా డ్రైవింగ్ చేసే అవకాశం లేదు. అదే జీవితం అంటే. ఒకరికి ఒకరు సాయం చేసుకోండి కలిసి ఎదగండి” అంటూ నమ్రత చేసిన ట్వీట్ మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. 

అయితే అసలు విషయం ఏమిటంటే నమ్రత పెట్టిన ట్విట్ ఆమె సొంత ఆలోచనలనుండి వచ్చింది కాదని గత కొద్ది రోజులుగా ఈ మెసేజ్ వెబ్ మీడియాలో హడావిడి చేస్తూ చాలామందికి కనిపిస్తోందని నమ్రత కూడ అదే మెసేజ్ ని కాపీ అండ్ పేస్ట్ చేస్తే ఎలా ? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరి కొందరైతే టాలీవుడ్ ‘శ్రీమంతుడు’ గా ఎదిగి పోయిన మహేష్ తన పుట్టిన ఊరు చెన్నై కష్టాలలో ఉంటే కేవలం 10 లక్షలతో సరిపెడతడా అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

‘శ్రీమంతుడు’ సినిమాలో హర్ష పాత్ర నటించిన మహేష్ ఈసినిమా ద్వారా నేర్చుకున్నది ఇదేనా అంటూ మరికొందరు వెబ్ మీడియాలో కామెంట్స్ విసురుతున్నారు. ఏది ఎలాగున్నా శ్రీమంతుడు భార్య నమ్రత కూడ కాపీ కొడితే ఎలా అంటూ కనిపిస్తున్న సెటైర్లు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: