కోటి కథ ఇదీ

Chowdary Sirisha
శర్వానంద్ తాజాగా ఓ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఇంతవరకూ లవర్ బాయ్ గా కనిపించిన శర్వానంద్... ప్రస్తుతం ‘కో అంటే కోటి’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి దర్శకుడు అనీష్. ఇక, ఈ చిత్ర కథ విషయానికొస్తే... ఓ కుర్రాడు... ఉన్నపళంగా కోటి రూపాయలు సంపాదించాలనుకుంటాడు. ఒక్క డీల్ లో కోటి రావాలంటే ఏం చేయాలా అని చాలా మార్గాలు అన్వేషిస్తాడు. చివరికి అలాంటి ఓ అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఏంటి? ఆ తరువాత ఆ కుర్రాడు కోటి రూపాయలు సంపాదించుకోగలిగాడా లేదా అన్న ఆసక్తికరమైన కథనంతో సాగుతుందీ కథ. ఈ చిత్రం తన కెరీర్ కి ప్లస్ అవుతుంది అంటున్నాడు శర్వానంద్. తన కెరీర్ లో ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదని చెబుతున్నాడు. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: